విధరరిపుగమనునికిని
10.1-233-క.
విషధరరిపుగమనునికిని
విషగళసఖునికిని విమల విషశయనునికిన్
విషభవభవజనకునికిని
విషకుచచనువిషముఁగొనుట విషమే తలపఁన్?
విషము కోరలలో ధరించే నాగులను చీల్చెడి
గరుత్మంతుడు వాహనంగా కలవాడు, కంఠమున విషము ధరించెడి శంకరుని మిత్రుడు, ప్రళయకాలమున
విషము (జలము)పై శయనించు నిర్మల మైన వాడు, విషము (నీటి) యందు పుట్టెడి పద్మము నందు
జనించిన వాడైన బ్రహ్మదేవునికి తండ్రియైన వాడు నైనట్టి సాక్షాత్తు మహావిష్ణువు యైన
ఈ బాలుడికి చన్నుల విషంతో తిరిగే ఒక రాకాసి విషం లాగివేటం విషమ (పెద్ద కష్ట)మైన
పనా, కానేకాదు.
యమకాలంకారంతో అలంకరించిన ఈ చమత్కార పద్యం నడక అద్భుతం. భావం
పరమాద్భుతం. రెండు అంతకన్న ఎక్కువ అక్షరాలు అర్థం భేదం కలిగి మరల మరల ప్రయోగిస్తే
యమకాలంకారం. ఈ పద్యంలో ‘విష’ అనే అక్షర ద్వయాన్ని ఏడు (7) మార్లు వాడి యమకం అలంకరించారు.
10.1-233-ka.
vishadhararipugamanunikini
vishagaLasakhunikini
vimala vishaSayanunikin
vishabhavabhavajanakunikini
vishakuchachanuvishamu@MgonuTa
vishamae talapa@Mn?
విషధర రిపు = గరుత్మంతునిపై {విషధర రిపుడు - విషధర (సర్పములకు) రిపుడు (శత్రువు), గరుత్మంతుడు}; గమనుని = విహరించువాని; కిని = కి; విషగళ = పరమశివుని {విష గళుడు - విషమును
కంఠమున ధరించినవాడు, శంకరుడు}; సఖుని = స్నేహితుని; కిని = కి; విమల = నిర్మల మైన; విష శయనుని = శేషశాయి {విష శయనుడు -
విష (జలము)పై శయనుడు, విష్ణువు}; కిన్ = కి; విష భవ భవ = బ్రహ్మదేవుని {విష భవ భవుడు -
విష (నీటియందు) భవ (పుట్టెడిది) యైన పద్మమున భవ (పుట్టినవాడు),
బ్రహ్మ}; జనకుని = తండ్రి; కిని = కి; విష = విషము పూసిన; కుచ = స్తనముల; చను = ఉండెడి; విషమున్ = విషమును; కొనుట = తీసుకొనుట; విషమే = కష్టమా, విషమమా, కాదు; తలపన్ = తరచిచూసినచో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment