వెలయగబద్మం
3-735-క.
వెలయఁగ బద్మం బేక
స్థలముననే యొప్పుఁ గాని త్వత్పద పద్మం
బిల బహు గతుల ననేక
స్థలముల దనరారుఁ గాదె తరుణాబ్జముఖీ!
నవనవలాడే తామరపూవులాంటి మోముగల మోహిని! లోకంలో
పద్మాలు ఒకేస్థలంలో ఉంటాయి కదా. మరి నీ పాదలనే పద్మాలో ఈ భూమ్మీద అనేక చోట్ల అనేక
రకాలుగా ప్రకాశిస్తు ఉన్నాయి కదే.
తనని విషయిస్తున్న రాక్షసుల
బారినుండి తప్పించుకోడానికి శ్రీహరి ఆజ్ఞ ప్రకారం తన దేహాన్ని విడిచాడు
బ్రహ్మదేవుడు. ఆ దేహంనుండి చక్కదనాల చుక్క ‘సంధ్యాసుందరి’ ఆవిర్భవించి వారిని మోహింప
జేసింది. ఆమెను రక్కసులు ఇలా వర్ణిస్తున్నారు.
3-735-ka.
velaya@Mga
badmaM baeka
sthalamunanae
yoppu@M gaani tva tpada padmaM
bila
bahu gatula nanaeka
sthalamula
danaraaru@M gaade taruNaabjamukhee!
వెలయఁగన్ = పూని; పద్మంబు = పద్మము; ఏక = ఒకే; స్థలముననే = స్థలమున మాత్రమే; ఒప్పున్ = ఒప్పి ఉండును; కాని = కాని; త్వత్ = నీ యొక్క; పద = పాదములు అను; పద్మంబున్ = పద్మములు; ఇలన్ = భూమిపైన; బహు = అనేక; గతులన్ = విధములుగ; అనేక = అనేకమైన; స్థలములన్ = స్థలముల యందు; తనరారున్ = అతిశయించును; కాదె = కదా; తరుణ = లేత; అబ్జ = పద్మము వంటి {అబ్జము - అప్పు (నీటి) యందు పుట్టినది, పద్మము}; ముఖీ = మోము కలదాన.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
Promote your Website or Blog for free and increase traffic to your site at http://forum.telugushortfilmz.com/
+Vijendar Reddy
మీ సైటు తెలుగులో లేదు. తెలుగు వాడేటప్పుడు చెప్పండి చూద్దాం.
Post a Comment