Monday, June 23, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 330

శారదనీరదేందు

1-8-ఉ.
శాదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హా తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దా సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కాత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు భారతీ!
          భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, పటీరం, రాజహంసలు, జాజిపూల దండలు, నీహారం, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!
గ్రంధారంభ సరస్వతీదేవి ప్రార్థన.
1-8-u.
SaaradaneeradaeMdu ghanasaara paTeera maraaLa mallikaa
haara tushaara phaena rajataachala kaaSa phaNeeSa kuMda maM
daara sudhaapayOdhi sitataamara saamaravaahinee Subhaa
kaarata noppu ninnu madi@M gaanaga nennaDu galgu bhaaratee!
          శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయస్ = నీటియొక్క; నిధి = పెద్దపోగు; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర = దేవతల; వాహినీ = నదిలో - ఆకాశగంగలో; శుభ = శుభకరమైన; ఆకారతన్ = ఆకారతతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: