Wednesday, June 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 332

శ్రవణోదంచిత

10.1-772-మ.
శ్ర ణోదంచిత కర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
తంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వశుండై మధు రాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే?
          సఖీ! మన కృష్ణుడు చూసావా చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకొన్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజా లందు నెమలిపింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు. పరవశత్వంతో వేణువు నందు తియ్యని అదరామృతం పూరించుతు, అడవిలో ఆలమందలను మేపుతు ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు.
శరత్కాలంలో గోపికలకు కనిపించిన చక్కదనాలు శ్రీకృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడో. రసరమ్యతతో పండిత పామరల మనసులు దోచిన అద్భుతమైనది యీ పద్యం.
10.1-772-ma.
Srava NOdaMchita karNikaaramunatO svarNaabha chaelaMbutO
navataMsaayita kaekipiMChamunatO naMbhOja daamaMbutO
svavaSuMDai madhu raadharaamRtamuchae vaMSaMbu@M booriMchuchu
nnuvidaa! maadhavu@M DaalaveMTa vanamaM doppaareDiM joochitae?
          శ్రవణ = చెవి యందు; ఉదంచిత = మిక్కిలి చక్కగా ఉంచబడిన; కర్ణికారమున్ = కొండగోగి పువ్వు; తోన్ = తోటి; స్వర్ణ = బంగారము; అభ = వంటి; చేలంబు = వస్త్రము; తోన్ = తోటి; అవతంసాయిత = శిగ యం దుంచబడిన, ముడి పిన్నుగా ఉంచబడిన; కేకి = నెమలి; పింఛమున్ = పింఛము, కుంచము; తోన్ = తోటి; అంభోజ = పద్మముల; దామంబు = దండ; తోన్ = తోటి; స్వవశుండు = స్వతంత్రుడు; = అయ్యి; మధుర = తియ్యనైన; అధర = పెదవులస్పర్శ అనెడి; అమృతము = అమృతము; చేన్ = చేత; వంశంబున్ = మురళిని; పూరించుచున్ = ఊదుతు; ఉవిదా = వనితా; మాధవుడు = కృష్ణుడు {మాధవుడు - మాధవి ప్రియుడు, కృష్ణుడు}; ఆల = ఆవుల; వెంటన్ = వెంబడిని; వనము = అడవి; అందున్ = లో; ఒప్పారెడిన్ = చక్కగాఉన్నాడు; చూచితే = చూచితివా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: