Sunday, June 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 329

శ్రీకంఠచాపఖండన

10.1-1-క.
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
                శివుని విల్లు విరిచిన వాడ! ఇంద్రాది వారు సైతం మెచ్చుకొనేలా యుద్ధం చేయవాడ! ప్రకాశమానమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైనవాడ! నిండుపున్నమి వెన్నెల వంటి స్వచ్ఛ మైన కీర్తి విరివిగా కలవాడ! ఓ శ్రీరామచంద్ర ప్రభో! నీకు నమస్కారం.
దశమస్కంధ పూర్వభాగారంభ ప్రార్థన యిది.
10.1-1-ka.
SreekaMThachaapa khaMDana!
paakaari pramukha vinuta bhaMDana! vilasa
tkaakutsthavaMSamaMDana!
raakaeMdu yaSOviSaala! raamanRpaalaa!
          శ్రీకంఠ చాప ఖండన = శ్రీరామ {శ్రీకంఠ చాప ఖండనుడు - శ్ర్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు}; పాకారి ప్రముఖ వినుత భండన = శ్రీరామ {పాకారిప్రముఖవినుతభండనుడు - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారిచేత వినుత (పొగడబడిన) భండన (యుద్ధము కలవాడు), రాముడు}; విలస త్కాకుత్స్థవంశ మండన = శ్రీరామ {విలస త్కాకుత్స్థ వంశ మండనుడు - విలసత్ (ప్రసిద్ధి కెక్కిన) కాకుత్స్థవంశ (కకుత్స్థ మహరాజ వంశమునకు) మండనుడు (అలంకార మైనవాడు), రాముడు}; రాకేందు యశో విశాల = శ్రీరామ {రాకేందుయశోవిశాలుడు - రాకేందు (నిండు పున్నమి చంద్రుని) వలె స్వచ్ఛమైన యశః (కీర్తి) విశాలుడు (విరివిగా కలవాడు), రాముడు}; రామ = రాముడు అనెడి {నిండుపున్నమిచంద్రుని పదహారు కళలు - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5పుష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 121శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత}; నృపాల = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: