Saturday, June 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 315


యాదవులందు

1-200-ఉ.
యావు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యారవృత్తితోఁ గదియుట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
          స్వామి! విశ్వేశ్వర! ఆత్మీయులైన యాదవులమీద, పాండవులమీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగాతరంగిణిలా నా బుద్థి సర్వదా నీ చరణసరోజ సంస్మరణంలోనే సంలగ్న మయ్యేటట్లు చెయ్యి.
ద్వారకకు తిరిగివెళ్తున్న శ్రీకృష్ణుని గూర్చి కుంతీదేవి చేసిన స్తుతి బహుప్రసిద్ధమైనది. ఆ స్తుతిలోని పద్య మిది.
1-200-u.
yaadavu laMdu@M baaMDusutulaMdu nadheeSvara! naaku mOhavi
chChaedamu saeyumayya! ghanasiMdhuvu@M jaereDi gaMgabhaMgi nee
paadasarOjachiMtanamupai naniSaMbu madeeyabuddhi na
tyaadaravRttitO@M gadiyunaTluga@M jaeya@M gadayya! yeeSvaraa!
          యాదవు లందున్ = యదు వంశమువారి మీదను; పాండుసుతు లందున్ = పాండురాజు పుత్రుల మీదను; అధీశ్వర = ప్రభూ; నాకు = నాకున్న; మోహ = మోహమును; విచ్ఛేదమున్ = నరకుట; సేయుము = చేయుము; అయ్య = అయ్యా; ఘన సింధువున్ = మహాసముద్రము; చేరెడి = చేరే టటువంటి; గంగ = గంగ; భంగిన్ = వలెను; నీ = నీ యొక్క; పాద = పాదములను; సరోజ = పద్మముల; చింతనము = భక్తి; పైన్ = మీద; అనిశంబు = అనవరతము; మదీయ = నా యొక్క; బుద్ధిన్ = మనసులో; అతి = మిక్కిలి; ఆదర = ఆదర మైన; వృత్తి = ప్రవర్తన; తోన్ = తో; కదియునట్లుగన్ = కూడి యుండునట్లుగా; చేయన్ = చేయవచ్చు; కద = కదా; అయ్య = అయ్యా; ఈశ్వరా = ఈశ్వరుడా (కృష్ణా).
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: