జయ ఉగాది జయ శుభాకాంక్షలు
ఎవ్వనిచేజనించు
8-73-ఉ
ఎవ్వనిచే జనించు జగ;
మెవ్వని లోపల
నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ;
బరమేశ్వరుఁ డెవ్వఁడు;
మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు;
సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు;
వాని నాత్మభవు నీశ్వరు
నే శరణంబు వేడెదన్.
ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి
ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు
పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే
పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది,
మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు,
ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.
గజేంద్రమోక్ష ఘట్టమే ఏకేశ్వరోపాసనా తత్వపూరితం. అందులో మొసలి
బారినపడి ప్రాణభయ విహ్వలుడై గజేంద్రుడు పెడుతున్న ఈ మొర ఏకేశ్వరోపాసన తత్వం మయం. దేవుడనే
పదానికి ఒక చక్కటి నిర్వచనం. అంతేనా అంతటి తత్వాన్ని రమ్యమైన, రసరమ్యమైన పద్యంలో ఎంత
తేలికగా అందించాడు పోతనామాత్యులు అంటే. వేరే తాత్పర్యం చూసి అర్థం చేసుకోవలసిన
అవసరమే లేని తెలుగు ఆణిముత్యంగా. ఇప్పటి చిన్నపిల్లలచే ట్వింకిల్ . . అని రైములు
చెప్పిస్తున్నారో, అలానే మొన్నటి దాకా ఈ పద్యాన్ని చెప్పించుకొనే వారు తెలుగువా రందరు.
8-73-u.
evvanichae
janiMchu jaga; mevvani lOpala nuMDu leenamai;
yevvani
yaMdu DiMdu@M; baramaeSvaru@M Devva@MDu; moolakaaraNaM
bevva@M;
Danaadi madhya layu@M Devva@MDu; sarvamu@M daana yainavaa@M
Devva@MDu;
vaani naatmabhavu neeSvaru nae SaraNaMbu vaeDedan.
ఎవ్వని = ఎవని; చేన్ = వలన; జనించు = పుట్టునో; జగము = విశ్వము; ఎవ్వని = ఎవని; లోపలన్ = లోపల; ఉండున్ = ఉండునో; లీనము = కలిసిపోయినది; ఐ = అయ్యి; ఎవ్వని = ఎవని; అందున్ = లోనికి; డిందున్ = లయము పొందునో; పరమేశ్వరుడు = అత్యున్నతమైనప్రభువు; ఎవ్వడు = ఎవడో; మూల = ప్రధాన; కారణంబు = కారణభూతుడు; ఎవ్వడు = ఎవడో; అనాదిమధ్యలయుడు = ఆదిమధ్యాంతములులేనివాడు; ఎవ్వడు = ఎవడో; సర్వమున్ = అన్నియును; తాన = తనే; ఐన = అయిన; వాడు = వాడు; ఎవ్వడు = ఎవడో; వానిన్ = వానిని; ఆత్మ = నాయొక్క; భవున్ = ప్రభువును; ఈశ్వరున్ = భగవంతుని; నేన్ = నేను; శరణంబు = శరణము; వేడెదన్ = కోరెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment