నరమూర్తిగాదు
7-286-క.
నరమూర్తి గాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరి యాకారము నున్నది
హరి మాయా రచిత మగు యథార్థము చూడన్.
ఈ రూపము ఉత్తి మానవ రూపము కాదు, ఉత్తి సింహం
రూపము కాదు. చూస్తే యథార్థంగా మానవాకారం, సింహాకారం రెండు కలిసి ఏర్పడిన శ్రీహరి
మాయా మూర్తిలా ఉంది.
అంటు ప్రహ్లాదుడు భక్తితో ధైర్యంగా విష్ణువు సర్వోపగతుడు
అన్న మాట నిజం చేసి, నన్ను శిక్షించడానికి నేను ఈ స్తంభాన్ని కొట్టగానే దానిలోంచి శ్రీపతి
మహాద్భుతంగా ఇలా ఆవిర్భవించాడు కాబోలు అనుకోసాగాడు. అవును మరి తలచినవాడు మాహా
సత్త్వగుణ సంపన్నుడైన ప్రహ్లాదుడు, సంహరించాల్సింది రజోగుణ తమోగుణాలు అతిశయించిన హిరణ్యకశిపుని.
అందుకే నరనారయణులలోని నర, క్రూర జంతువులలో సింహ రూపాలను కలుపుకున్నాడేమో.
7-286-ka.
naramoorti
gaadu kaevala
harimoortiyu@M
gaadu maanavaakaaramu@M gae
sari
yaakaaramu nunnadi
hari maayaa
rachita magu yathaarthamu chooDan.
నర = మానవ; మూర్తి = స్వరూపము; కాదు = కాదు; కేవల = వట్టి; హరి = సింహపు; మూర్తియున్ = స్వరూపము; కాదు = కాదు; మానవ = మనిషి; ఆకారము = స్వరూపము; కేసరి = సింహపు; ఆకారము = స్వరూపము; ఉన్నది = కలిగినది; హరి = విష్ణుని; మాయా = మాయచేత; రచితము = నిర్మింపబడినది; అగు = ఐన; యథార్థము = సత్యమైనది; చూడన్ = తరచిచూసినచో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment