Monday, March 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 216

శుకుడు గోచియులేక

 1-77-త.

శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీర లొల్లక ల్లులాడెడి దేవక
న్యలు హా! శుక!యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం
శుములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ!
          ఓ సూతమహర్షి విజ్ఞానఖని! ఒకమారు వ్యాస పుత్రు డయిన శుకమహాముని కనీసం గోచీకూడా లేకుండ దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క ఒక సరస్సులో ఉన్న దేవకన్యలు శుకుని చూసి కూడ చీరలు ధరించలేదు. ఏమాత్రం చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. శుకుని వెనకాతలే కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు వయోవృద్ధుడు, పరమజ్ఞాన స్వరూపుడు వ్యాసమహర్షి. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు.
అంటు శౌనకుడు అంతటి విరాగి అయిన శుకుడు, ఒక మహారాజు వద్ద కూచుని భాగవతం ఎలా చెప్పాడు వివరించమని సూతుని అడుగుతున్నాడు.
1-77-ta.
Suku@MDu gOchiyu laeka pai@M jana@M joochi tOyamulaMdu la
jjaku@M jaliMpaka cheera lollaka challulaaDeDi daevaka
nyakalu, haa! Suka!, yaMchu venka janaMga vyaasuni@M joochi yaM
Sukamulan dhariyiMchi sigguna srukki raMdaRu dheenidhee!
          శుకుఁడు = శుకుడు; గోచియున్ = గోచీ కూడా; లేక = లేకుండా; పైన్ = బయట; చనన్ = వెళ్ళుచుండగా; చూచి = చూచి కూడ; తోయములు = నీటి; అందున్ = లోపల; లజ్జ = సిగ్గు; కున్ = కు; చలింపక = ఓడకుండా; చీరలు = చీరలను; ఒల్లక = కోరక; చల్లులాడెడి = జలకాలాడెడి; దేవ = దేవలోకపు; కన్యకలు = కన్యలు; హా = ఓహో; శుక = శుకుడా; అంచున్ = అనుచు; వెన్కన్ = వెనకాతలే; చనంగన్ = వెళ్ళుచుండగా; వ్యాసునిన్ = వ్యాసుని; చూచి = చూచుట వలన; అంశుకములన్ = సన్నని వస్త్రములను; ధరియించి = ధరించి; సిగ్గునన్ = సిగ్గుతో; స్రుక్కిర = జంకిరి; అందఱు = అందరును; ధీనిధీ = బుద్ధిమంతుడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: