Sunday, March 30, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 243

ఇమ్మనుజేశ్వరాధముల

1-13-ఉ.
మ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే
మ్మెట వ్రేటులం బడక మ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
మ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
          విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి నా మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. ఈ బమ్మర పోతరాజుకి, అలా చేస్తే ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలతో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిగెబ్బలు తప్పవని తెలుసు. అందుకే చక్కగా ఆలోచించుకొని మనస్పూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించను.
1-13-u.
immanujaeSvaraadhamula kichchi puraMbulu vaahanaMbulun
sommulu@M gonni puchchukoni chokki Sareeramu vaasi kaaluchae
sammeTa vraeTulaM baDaka sammatitO hari kichchi cheppe nee
bammera pOtaraajoka@MDu bhaagavataMbu jagaddhitaMbugan.
          = ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; = ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = ప్రియము సమకూర్చునట్టిది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: