Thursday, March 20, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 233

వ్రాలంగవచ్చిన

10.1-320-క.
వ్రాలఁగ వచ్చిన నీ సతి
చూలాలం దలఁగు మనుఁడు జూ లగుటకు నే
మూలంబు చెప్పు మనె నీ
బాలుఁడు; చెప్పుదురె సతులు? ర్వేందుముఖీ!
          ఓ యశోజమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె గర్భవతిని దూరంగా ఉండు అంది. గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా.
ఇది బమ్మర పోతనామాత్యుల కృష్ణుని కపట శైశవ దొంగజాడలు. ఇది చాలదన్నట్టు లకార ప్రాస వేసాడు అందాలు అద్దాడు. పర్వేందుముఖి బ్రహ్మవిద్యకు సంకేతంగా వాడారు. వ్రాలగ తనలో ఐక్యం చేసుకోడాన్ని సూచించడానికి వాడారు. చూలగుట పరిపక్వానికి చేరబోతున్న సూచన. గీతా ప్రమాణం అహం బీజప్రదః పితా; బీజంతదహ మర్జున!” కదా. నీవు చూలగుటకు కారణం నేనే అని సూచిస్తున్నాడు.
10.1-320-ka.
vraala@Mga vachchina nee sati
choolaalaM dala@Mgu manu@MDu joo laguTaku nae
moolaMbu cheppu mane nee
baalu@MDu; cheppudure satulu? parvaeMdumukhee!
          వ్రాలగన్ = మీదపడుటకు; వచ్చినన్ = రాగా; = ; సతి = ఇంతి; చూలాలన్ = గర్భిణిని; తలగుము = తప్పుకొనుము; అనుడున్ = అనగా; చూలు = గర్భము; అగుట = కలుగుట; కున్ = కు; = ఏది; మూలంబు = కారణము; చెప్పుము = చెప్పు; అనెన్ = అన్నాడు; నీ = నీ యొక్క; బాలుడు = పిల్లవాడు; చెప్పుదురె = చెప్తారా; సతులు = ఇల్లాండ్రు; పర్వేందుముఖీ = సుందరీ {పర్వేందుముఖీ - పర్వ (పౌర్ణమినాటి) ఇందు (చంద్రునివంటి) ముఖి (మోము కలామె), స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

gajula sridevi said...

బాలకృష్ణుని చిలిపి చేష్టలు సామాన్యమైనవి కావు. రావుగారు చాలా బాగా వివరిస్తున్నారు.

vsrao5- said...

అవునండి +sridevi gajula గారు. అతిమానుషాలు, సకలార్థ సాధకాలు, గంభీర భావార్థసహితాలు మా నల్లనయ్య చిలిపిచేష్టలు.
ధన్యవాదాలు మీ కృష్ణానురక్తికి, తెలుగుభాగవతంపై చూపుతున్న ఆదరాభిమానాలకి.