Thursday, March 13, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 226

ఆ రాజకన్యక

10.2-128-క.
రాజకన్య ప్రియమున
నా రాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో
కారాధితు మాధవుఁ దన
కారాధ్యుండైన నాథుఁ ని కోరె నృపా!
          రాజకుమార్తె నాగ్నజిత్తి మోహనాకారుడు, పద్మనేత్రుడు, త్రిలోకపూజితుడు అయినట్టి శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావించింది.
శ్రీకృష్ణుడు ఏడు వృషభాలని జయించిన వాడే ఆ కన్యకు భర్త అని ఆమె తండ్రి నగ్నజిత్తు మహరాజు నియమించాడని తెలిసి సేనా సమేతంగా స్వయంవరానికి విచ్చేసాడు.
10.2-128-ka.
aa raajakanya priyamuna
naa raajeevaakshu mOhanaakaaru@M drilO
kaaraadhitu maadhavu@M dana
kaaraadhyuMDaina naathu@M Dani kOre nRpaa!
          = ఆ యొక్క; రాజకన్య = రాకుమారి; ప్రియమునన్ = ఇష్టముతో; = ఆ ప్రసిద్ధుడైన; రాజీవాక్షున్ = కృష్ణుని {రాజీవాక్షుడు - ఎర్రకలువలవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; మోహనాకారున్ = కృష్ణుని {మోహనాకారుడు - మోహము పుట్టించెడి ఆకారము కలవాడు, కృష్ణుడు}; త్రిలోకారాధితున్ = కృష్ణుని {త్రిలోకారాధితుడు - ముల్లోకములచేత ఆరాధింపబడు వాడు, విష్ణువు}; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - యదు పుత్రుడు అగు మధువు వంశమున అవతరించిన వాడు, కృష్ణుడు}; తన = ఆమె; కున్ = కు; ఆరాధ్యుండు = పూజనీయుండు; ఐన = అయిన; నాథుడు = భర్త; అని = అని; కోరెన్ = కోరుకొనెను; నృపా = రాజా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: