Sunday, March 16, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 229


మన సారథి

1-359-క.
సారథి, మన సచివుడు,
వియ్యము, మన సఖుండు, న భాంధవుఁడున్,
విభుడు, గురుడు, దేవర,
లను దిగనాడి చనియె నుజాధీశా! 
          ఏం చెప్పమంటారు మహారాజా! మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడునీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేన బావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు ఐన కృష్ణుడు మనలని వదలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా.
అంటు అర్జునుడు కృష్ణనిర్వాణం దుఃఖంతో నిర్వేదంగా ధర్మరాజుకు విన్నవిస్తున్నాడు.
1-359-ka.
mana saarathi, mana sachivuDu,
mana viyyamu, ma nasakhuMDu, mana bhaaMdhavu@MDun,
mana vibhuDu, guruDu, daevara,
manalanu diganaaDi chaniye manujaadheeSaa!
          మన = మన యొక్క; సారథి = మార్గదర్శకుడు / రథసారథి; మన = మనకు; సచివుడు = మంత్రాంగము చెప్పువాడు; మన = మన యొక్క; వియ్యము = వియ్యంకుడు; మన = మనకు; సఖుండు = స్నేహితుడు; మన = మనకు; భాంధవుఁడున్ = బంధువు; మన = మన యొక్క; విభుడు = వైభవమునకు కారకుడును; గురుడు = పెద్ద; దేవర = దేవతా స్వరూపుడును; మనలను = మనలను; దిగనాడి = విడిచిపెట్టి; చనియెన్ = వెళ్ళిపోయాడు; మనుజాధీశా = రాజా {మనుజాధీశుడు - మనుజులకు అధీశుడు, రాజు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: