Saturday, March 1, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 214

చెప్పడొక చదువు

7-210-క.
చెప్పఁ డొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్.
          మనకి చదువు చెప్తున్న ఈ ఉపాధ్యాయులు మనకెప్పుడు మంచి చదువులు ఏవీ చెప్పటంలేదు. ఎంతసేపు చెవులు చిల్లులు పడేలాగ సంసారభోగాలను, కర్మబంధాలను గురించే చెప్తుంటారు. నా మాట వినండి. మనసులను పరవశింపజేసే ఒక మంచి చదువును చెప్తాను వినండి.
ఇలా ప్రహ్లాదుడు తనతోటి విద్యార్థులకు చండామార్క గురువులు లేని సమయాలలో విష్ణుభక్తి గురించి చెప్పసాగాడు. మరి రాజకుమారుడు కదా ప్రజలకు మేలుచేయాలి కదా అందుచేత వారికి విష్ణుభక్తి బోధిస్తున్నాడు.
7-210-ka.
cheppa@M Doka chaduvu maMchidi
cheppeDi@M dagulamulu chevulu chiMdaRa gona@Mgaa@M
jeppeDu mana yeDa nojjalu
cheppeda noka chaduvu vinu@MDu chittamu lalaran.
          చెప్పడు = తెలుపడు; ఒక = ఒక; చదువు = శాస్త్రము; మంచిది = మంచిది; చెప్పెడిన్ = చెప్పును; తగులములు = సాంసారిక బంధనములను; చెవులు = చెవులు; చిందఱగొనగాన్ = చెదిరిపోవునట్లు; చెప్పెడు = చెప్పును; మన = మన; ఎడన్ = అందు; ఒజ్జలు = గురువులు; చెప్పెదన్ = తెలిపెదను; ఒక = ఒకటి; చదువు = విద్యని; వినుడు = వినండి; చిత్తముల్ = మనసులు; అలరన్ = సంతోషించునట్లుగ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

gajula sridevi said...

రావుగారు,నేటి కాలంలోని చదువులు ఇవియే కదా ?