తుదమొదళ్ళకు
3-637-సీ.
తుద మొదళ్ళకుఁ జిక్కి
దునిసి
పాఱఁగ మోరఁ
గులశైలములఁ జిమ్ముఁ గొంత దడవు
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులువోవఁ
గొమ్ములఁ దాటించుఁ గొంత దడవు
జలధు లేడును బంక సంకులంబై యింక
ఖురముల మట్టాడుఁ గొంత దడవు
నుడురాజు సూర్యుఁడు నొక్క మూలకుఁ బోవఁ
గుఱుచ వాలము
ద్రిప్పుఁ గొంత దడవు
తే.
గునియుఁ గుప్పించి లంఘించుఁ
గొప్పరించు
నెగయు ధరఁ ద్రవ్వు
బొఱియఁగా నేపురేగి
దానవేంద్రుని గుండెలు
దల్లడిల్లఁ
బంది మెల్లన రణపరిపంథి యగుచు.
ఆదివరాహం కొంతసేపు ముట్టెతో కులపర్వతాలు
తుదిమొదళ్ళు కొట్టుకుపోయి ముక్కలు ముక్కలు ఐపోయేలా కూలతోస్తు, కొంచంసేపు కొమ్ముతో బ్రహ్మాండభాండం
పగిలి చిల్లులుపడేలా చిమ్ముతు, మరి కొంతసేపు గిట్టలతో సప్తసముద్రాలు ఏడు బురద బురదలై
ఇంకిపోయేలా మట్టగిస్తు, కొంతతడవు తన పొట్టితోకను సూర్యచంద్రులు ఓమూలకు
కొట్టుకుపోయేలా గిరగిర తిప్పుతు, ఇంకా ఇటునటు కులుకుల అడుగులు వేస్తూ, కుప్పించి గెంతుతు,
దూరాలు దాటుతు, నేల బొరియలుపడేలా తవ్వుతు విజృంభించి విహరించసాగింది. ఆ రాక్షసరాజు
హిరణ్యాక్షుడి గుండె తల్లడిల్లేలా క్రమంగా యుద్దానికి సిద్ధంకాసాగింది.
హిరణ్యాక్షుని వధించడానికి, జలగర్భంలోంచి భూమిని
ఉద్దరించడానికి సముద్ర జలాల్లో ఆదివరాహ అవతారం ఎత్తిన శ్రీమహావిష్ణువు అలా అనివార్యమైన
శౌర్యంతో నిరాటంకంగా విహరించడాన్ని వర్ణించటంలో సునిశిత గాంభీర్యం ఉట్టిపడుతున్నది.
పంది విహరించే విధానం, దాని నడవడికలను, అవతారుని ఔన్నత్యాన్ని సమన్వయ పరచిన ఈ అత్యద్భుతమైన భాగవత పద్యం కవి చమత్కార, సునిశిత పరిశీలనా
శక్తిలకు ఉదాహరణ.
3-637-see.
tuda
modaLLaku@M jikki dunisi paaRa@Mga mOra@M
gulaSailamula@M
jimmu@M goMta daDavu
brahmaaMDabhaaMDaMbu
pagili chilluluvOva@M
gommula@M
daaTiMchu@M goMta daDavu
jaladhu
laeDunu baMka saMkulaMbai yiMka
khuramula
maTTaaDu@M goMta daDavu
nuDuraaju
sooryu@MDu nokka moolaku@M bOva@M
guRucha
vaalamu drippu@M goMta daDavu
tae.
guniyu@M
guppiMchi laMghiMchu@M goppariMchu
negayu
dhara@M dravvu boRiya@Mgaa naepuraegi
daanavaeMdruni
guMDelu dallaDilla@M
baMdi mellana
raNaparipaMthi yaguchu.
తుద = చివర; మొదళ్ల = మొదలుల; కున్ = కు; చిక్కి = కృశించి; తునిసి = చినగి; పాఱగన్ = పోవగా; మోరన్ = మెడను; కులశైలములన్ = కులపర్వతములను; చిమ్మున్ = చెదరగొట్టును; కొంత = కొంచము; తడవు = సేపు, కాలము; బ్రహ్మాండ = బ్రహ్మాండము అను; భాండమున్ = కుండను; పగిలి = పగిలిపోయి; చిల్లులు = కన్నములు; పోవన్ = పడునట్లుగ; కొమ్ములన్ = కొమ్ములతో; తాటించు = కొట్టును; కొంత = కొంచెము; తడవు = సేపు; జలధులు = సముద్రములు {జలధి - జలము (నీటి)ని ధరించి ఉండునది, సముద్రము}; ఏడున్ = ఏడును (7); పంక = బురద; సంకులమున్ = మయముగ; ఐ = అయిపొయి; ఇంకన్ = ఇంకిపోవునట్లు; ఖురములన్ = గిట్టలతో; మట్టాడున్ = కాలితో గెంటును; కొంత = కొంచము; తడవున్ = సేపు; ఉడురాజు = చంద్రుడు; సూర్యుడున్ = సూర్యుడును; ఒక్క = ఒకే; మూల = మూల; కున్ = కు; పోవన్ = పోవునట్లు; కుఱుచ = పొట్టి; వాలమున్ = తోకను; త్రిప్పున్ = తిప్పును; కొంత = కొంచము; తడవు = సేపు; గునియున్ = కులుకు; కుప్పించి = గెంతి; లంఘించున్ = దాటును; కొప్పరించున్ = తవ్విపెళ్ళగించును; ఎగయున్ = ఎగురును; ధరన్ = భూమిని; త్రవ్వున్ = తవ్వును; బొఱియగన్ = గుంటపడునట్లు; ఏపురేగి = విజృంభించి; దానవ = రాక్షస; ఇంద్రుని = ప్రభువు యొక్క; గుండెలు = గండెలు; తల్లడిల్లన్ = తల్లడిల్లగ; పంది = వరాహమూర్తి; మెల్లనన్ = మెల్లగా; రణ = యుద్ధమునకు; ప్రతి = ఎదురు, సిద్దపడి; పంథి = వెళ్లువాడు; అగుచున్ = అవుతూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment