ధరణిదుహితృరంతా
7-481-మా.
ధరణి దుహితృ రంతా! ధర్మ మార్గానుగంతా!
నిరుపమ నయవంతా! నిర్జరారాతి హంతా!
గురు బుధ సుఖకర్తా! కుంభినీచక్ర భర్తా!
సుర భయ పరిహర్తా! సూరి చేతో విహర్తా!
భూదేవి పుత్రిక సీతాదేవితో
క్రీడించువాడా! ధర్మమార్గమునందే చరించువాడా! సాటిలేని
నీతిగలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసుల సంహరించినవాడా! గురువులకు
పెద్దలకు జ్ఞానులకు సాధువులకు సుఖసౌఖ్యములను సమకూర్చువాడా! భూమండలము
నంతను ఏలిన చక్రవర్తి! దేవతల భీతిని తొలగించువాడా! పరమ జ్ఞానుల
చిత్తములలో విహరించువాడా! శ్రీరామచంద్ర ప్రభో! కరుణించుము.
7-481-maa.
dharaNi duhitR
raMtaa! dharma maargaanugaMtaa!
nirupama
nayavaMtaa! nirjaraaraati haMtaa!
guru budha
sukhakartaa! kuMbhineechakra bhartaa!
sura bhaya
parihartaa! soori chaetO vihartaa!
ధరణిదుహితృరంతా = శ్రీరామా {ధరణి దుహితృ రంతుడు - ధరణీ (భూదేవి) దుహితృ
(కుమార్తె) యైన సీతతో రంతుడు (క్రీడించు వాడు), రాముడు}; ధర్మమార్గానుగంతా = శ్రీరామా {ధర్మమార్గానుగంతుడు - ధర్మమార్గ (ధర్మ మార్గమును) అనుగంతుడు
(అనుసరించు వాడు), రాముడు}; నిరుపమ నయవంతా = శ్రీరామా {నిరుపమ నయవంతుడు - నిరుపమ (సాటిలేని) నయవంతుడు (నీతి గల వాడు), రాముడు}; నిర్జరారాతి హంతా = శ్రీరామా {నిర్జరారాతి హంత - నిర్జరారాతి (దేవతల శత్రువు లగు రాక్షసులను)
హంత(చంపిన వాడు), రాముడు}; గురు బుధ సుఖకర్తా = శ్రీరామా {గురు బుధ సుఖకర్త - గురు (గురువులకు) బుధ (జ్ఞానులకు) సుఖ
(సౌఖ్యమును) కర్త (సమకూర్చిన వాడు), రాముడు}; కుంభినీచక్ర భర్తా = శ్రీరామా {కుంభినీచక్ర భర్త - కుంభినీ (భూ) చక్ర
(మండలమునకు) భర్త (నాథుడు), రాముడు}; సుర భయ పరిహర్తా = శ్రీరామా {సుర భయ పరిహర్త - సుర (దేవతల) భయ (భయమును)
పరిహర్త (పోగొట్టిన వాడు), రాముడు}; సూరి చేతో విహర్తా = శ్రీరామా {సూరి చేతో విహర్త - సూరి (జ్ఞానుల) చేతస్
(చిత్తములలో) విహర్త (క్రీడించు వాడు), రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment