Wednesday, March 5, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 218

దళదరవింద

3-922-సీ.
ళదరవింద సుంర పత్ర రుచి రాక్షు; లలిత శ్రీవత్సలితవక్షు
నీలనీరదనీలనీలోత్పలశ్యాము; లికులాకులమాలికాభిరాముఁ
గౌస్తుభకలిత ముక్తాహారయుత కంఠు; యోగిమానస పంకజోపకంఠు
తత ప్రసన్నసస్మిత వదనాంభోజు; దినకరకోటి సందీప్త తేజు
తే. లలి తానర్ఘ్య రత్న కుంల కిరీట
హార కంకణ కటక కేయూర ముద్రి
కాతులా కోటి భూషు భక్త ప్రపోషుఁ
గింకిణీ యుత మేఖ లాకీర్ణ జఘను.
          శ్రీమన్నారాయణుడు అప్పుడే వికసిస్తున్న అరవింద పూల తాజా పూరేకుల వంటి అందమైన కన్నులు కలవాడు; సొగసైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలమున ఉన్నవాడు; నీలిమేఘంలా, నల్లకలువలా శ్యామలఛాయ వాడు; తుమ్మెదలకు కనువిందుచేసే వైజయంతికామాలికతో విరాజిల్లేవాడు; కౌస్తుభమణితో శోభించే ముత్యాల హారం కంఠమున ధరించిన వాడు; యోగీశ్వరుల హృదయకమలాలకు దగ్గరైనవాడు; విలువైన రమణీయమైన రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, ఉంగరాలు, అందెలు మొదలైన సకల అలంకారాలతో విలసిల్లేవాడు; కటిప్రదేశము నందు ఘల్లు ఘల్లు మనే గజ్జెల మొలతాడు కట్టుకుని విరాజిల్లేవాడు.
అట్టి శ్రీమన్నారాయణుని స్వనాసాగ్రమున దృష్టి కేంద్రీకరించి, సుయోగి యైనవాడు ధ్యానం చేయాలి అంటు యోగీంద్రుల ధర్మాలను కపిలమహర్షి తల్లి దేవహూతికి ఉపదేశిస్తున్నాడు
3-922-see.
daLadaraviMda suMdara patra ruchi raakshu; salalita Sreevatsakalitavakshu
neelaneeradaneelaneelOtpalaSyaamu; nalikulaakulamaalikaabhiraamu@M
gaustubhakalita muktaahaarayuta kaMThu; yOgimaanasa paMkajOpakaMThu
satata prasannasmita vadanaaMbhOju; dinakarakOTi saMdeepta taeju
tae. salali taanarghya ratna kuMDala kireeTa
haara kaMkaNa kaTaka kaeyoora mudri
kaatulaa kOTi bhooshu bhakta prapOshu@M
giMkiNee yuta maekha laakeerNa jaghanu.
దళదరవింద సుందర పత్ర రుచిరాక్షున్ = విష్ణుమూర్తిని {దళదరవింద సుందర పత్ర రుచిరాక్షుడు - దళత్ (విచ్చుకొనుచున్న) అరవింద (పద్మముల) సుందర (అందమైన) పత్ర (రేకుల వంటి) రుచిర( ప్రకాశమైన) అక్షుడు (కన్నులు కలవాడు) , విష్ణువు}; సలలిత శ్రీవత్స కలిత వక్షున్ = విష్ణుమూర్తిని {సలలిత శ్రీవత్స కలిత వక్షుడు - సలలిత (అందమైన) శ్రీవత్స (శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ) కలిత (కలిగిన) వక్షున్ (వక్షస్థలము కలవాడు) , విష్ణువు}; నీల నీరద నీల నీలోత్పల శ్యామున్ = విష్ణుమూర్తిని {నీల నీరద నీల నీలోత్పల శ్యాముడు - నీల (నల్లని) నీరద (మబ్బు వలెను) నీల (నల్లని) నీలోత్పల (నల్లకలువ వలెను) శ్యాముడు (నల్లగా ఉన్నవాడు) , విష్ణువు}; అలికులాకుల మాలికాభిరామున్ = విష్ణుమూర్తిని {అలికులాకుల మాలికాభిరాముఁడు- అలి (తుమ్మెదల) కుల (సమూహమును) ఆకుల (చలింప జేసే) మాలికా (వైజయంతీ మాలికతో) అభిరాముడు (చక్కనైన వాడు), విష్ణువు}; కౌస్తుభ కలిత ముక్తాహార యుత కంఠున్ = విష్ణుమూర్తిని {కౌస్తుభ కలిత ముక్తాహార యుత కంఠుడు - కౌస్తుభ (కౌస్తుభము అను మణి) కలిత (కూడిన) ముక్త (ముత్యాల) హార (హారములుతో) యుత (కూడిన) కంఠుడు (కంఠము కలవాడు), విష్ణువు}; యోగిమానస పంకజోపకంఠున్ = విష్ణుమూర్తిని {యోగిమానస పంకజోపకంఠుడు - యోగి (యోగుల) మానస (మనసులు అనెడి) పంకజ (పద్మముల) ఉపకంఠుడు (సమీపమున ఉన్నవాడు), విష్ణువు}; సతత ప్రసన్న సస్మిత వదనాంభోజున్ = విష్ణుమూర్తిని {సతత ప్రసన్న స్మిత వదనాంభోజుడు - సతత (ఎల్లప్పుడును) ప్రసన్న (ప్రసన్నమైన) సస్మిత (చిరునవ్వుతో కూడిన) వదన (మోము అనెడి) అంభోజున్ (పద్మము కలవాడు), విష్ణువు}; దినకర కోటి సందీప్త తేజున్ = విష్ణుమూర్తిని {దినకర కోటి సందీప్త తేజుడు - దినకర (సూర్యులు) కోటి (కోటి మందితో సమానమైన) సందీప్తుడు (ప్రకాశము కలవాడు), విష్ణువు}; సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రికాతులాకోటి భూషున్ = విష్ణుమూర్తిని {సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట హార కంకణ కటక కేయూర ముద్రికాతులాకోటి భూషుడు - సలలితా (అందమైన) అనర్ఘ్య (వేలకట్టలేని) రత్నములు తాపిన కుండలములు కిరీటములు హారములు కంకణములు కటక (కడియము)లు కేయూర (భుజకీర్తులు) ముద్రికా (ఉంగరములు) తులాకోటి (అందెలు) లతో భూషితుడు (అలంకరింపబడినవాడు), విష్ణువు}; భక్తప్రపోషున్ = విష్ణుమూర్తిని {భక్తప్రపోషుడు - భక్తులను చక్కగా పోషించువాడు, విష్ణువు}; కింకిణీ యుత మేఖలాకీర్ణ జఘనున్ = విష్ణుమూర్తిని {కింకిణీ యుత మేఖలాకీర్ణ జఘనుడు - కంకిణీ (గజ్జలు) యుత (కలిగిన) మేఖలా (వడ్డాణము) తో ఆకీర్ణ (కూడిన) జఘనుడు (నడుము కలవాడు)}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: