వసుధాఖండము
8-570-మ.
వసుధాఖండము వేఁడితో? గజములన్
వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో
యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ
వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?
భూభాగం
కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుర్రాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే
జవరాండ్రను కోరుకోవాలి. కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు. నీ సిరి / సామర్థ్యం
ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు. ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా
ఇస్తాను. అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.
8-570-ma.
vasudhaakhaMDamu
vae@MDitO? gajamulan vaaMChiMchitO? vaajulan
vesanoohiMchito?
kOritO yuvatulan veekshiMchi kaaMkshiMchitO?
pasi baaluMDavu;
naera vee vaDuga; nee bhaagyaMbu leepaaTi gaa
kasuraeMdruMDu
padatrayaM baDuga nee yalpaMbu nee naerchunae?
వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుట కాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుట కాని; వాజులన్ = గుర్రములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = కావాలని కాని; కోరితో = కావాలనుట కాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరి; పసి = బాగాచిన్న; బాలుండవు = పిల్లవాడవు; నేరవు = తెలియనివాడవు; అడుగ = అడుగుట; నీ = నీయొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈమాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షసచక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగెనని; ఈ = ఇంత; అల్పంబున్ = కొంచమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయకలడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment