Monday, March 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 237

చెలగరు

1-488-క.
చెలఁగరు కలఁగరు సాధులు
మిళితము లయి పరులవలన మేలుం గీడున్
నెకొనిన నైన నాత్మకు
నొయవు సుఖ దుఃఖ చయము యుగ్మము లగుచున్.
          సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు, కీడులకు కుంగిపోరు. మహాత్ముల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహించవు.
భాగవతుల లక్షణాలను తెలుపుతు భాగవతంలో తన కొడుకు పరీక్షిత్తును శపించుటకు సంతోషించని శృంగి తండ్రి శమీకమహర్షి నోట ఇలా పలికించారు. ద్వంద్వాలకు కోపతాపాలకు లొంగరు, భగవంతునిపై ప్రపత్తి విడువరు, సుఖదుఃఖాలకు కలగరు.
1-488-ka.
chela@Mgaru kala@Mgaru saadhulu
miLitamu layi parulavalana maeluM geeDun
nelakonina naina naatmaku
nolayavu sukha du@hkha chayamu lugramu laguchun.
చెలఁగరు = రెచ్చిపోరు; కలఁగరు = క్రుంగిపోరు; సాధులు = మంచి నడవడిక కలవారు; మిళితములు = కలగలుపులు; అయి = అయ్యి; పరుల = ఇతరుల; వలనన్ = వలన; మేలున్ = మంచి; కీడున్ = చెడులు; నెలకొనినన్ = కలిగినట్లు; ఐన = అయినను; ఆత్మ = ఆత్మ; కున్ = కి; ఒలయవు = కలుగవు; సుఖ = సుఖముల; దుఃఖ = దుఃఖముల; చయములు = సమూహములు; యుగ్మములు = ద్వంద్వములు; అగుచున్ = అవుతూ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: