పుష్కరంబందు
12-46-తే.
పుష్కరం బందు ద్వారకాపురము నందు
మథుర యందును రవిదిన మందు నెవఁడు
పఠన సేయును రమణతో భాగవతము
వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.
పుష్కర తీర్థంలోకాని,
ద్వారకానగరంలోకాని, మథురలోకాని, ఆదివారం నాడు ప్రీతిగా భాగవతాన్ని చదివిన వారు అప్పటి
కప్పుడే సంసార సముద్రాన్ని తరిస్తారు,
12-46-tae.
pushkaraM
baMdu dvaarakaapuramu naMdu
mathura
yaMdunu ravidina maMdu neva@MDu
paThana
saeyunu ramaNatO bhaagavatamu
vaa@MDu
tariyiMchu saMsaaravaardhi napuDa.
పుష్కరంబు = పుష్కరతీర్థం; అందున్ = లో; ద్వారకాపురము = ద్వారకా పట్టణము; అందున్ = లో; మథుర = మథురానగరం; అందును = లోను; రవిదినము = ఆదివారము; అందున్ = లోను; ఎవడు = ఎవరైతే; పఠన = చదువుట; చేయున్ = చేస్తాడో; రమణ = ఆసక్తిపూర్వకంగా; భగవతమున్ = భాగవతమును; వాడు = అట్టివాడు; తరియించున్ = దాటును; సంసార = సంసార మనెడు; వార్ధిన్ = సముద్రమును; అపుడ = ఆ సమయమునందే.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment