Tuesday, March 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 224

శ్రీకర

10.2-1-క.
శ్రీర! పరిశోషిత ర
త్నార! కమనీయగుణగణాకర! కారు
ణ్యార! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
          శ్రీరామచంద్రప్రభు! సకల సంపదలను కలుగజేసేవాడ! సముద్రాన్ని ఇంకింప జేసిన మహాశక్తిశాలి! మనోహరమైన గుణగణాలకు నిలయమా! దయాసాగరా! భయంకర మైన బాణపరంపరలతో రాక్షసులను కంపింపజేసిన వాడ! నీకు వందనములు.
10.2-1-ka.
Sreekara! pariSOshita ra
tnaakara! kamaneeyaguNagaNaakara! kaaru
Nyaakara! bheekaraSara dhaa
raakaMpitadaanavaeMdra! raamanaraeMdraa!
          శ్రీకర = శ్రీరామ {శ్రీకరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషిత రత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రుడు కలవాడు), రాముడు}; కమనీయ గుణగ ణాకర = శ్రీరామ {కమనీయగుణగణాకరుడు - కమనీయ (మనోజ్ఞములైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారు ణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకర శరధారాకంపిత దానవేంద్ర = శ్రీరామ {భీకరశరధారాకంపితదానవేంద్రుడు - భీకర (భయంకరమైన) శర (బాణముల) దారా (పరంపరలచే) కంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామనరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: