Friday, March 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 227

పరమపావన

3-1053-.
మపావన! విశ్వభావన! బాంధవప్రకరాననా!
ధిశోషణ! సత్యభాషణ! త్కృపామయభూషణా!
దురితతారణ! సృష్టికారణ! దుష్టలోకవిదారణా!
ణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దనఖేలనా!
          శ్రీరామచంద్రప్రభు! నీవు పరమపావనుడవు. విశ్వభావనుడవు. బంధుజనావనుడవు. సముద్రజలాలను శోషింపజేసిన వాడవు. సత్యభాషణుడవు, అపారదయాగుణ భూషణుడవు. దురితాలను గట్టెక్కించే వాడవు. జగత్ సృష్టికి కారణభూతుడవు. దుష్టులను చీల్చి చెండాడు వాడవు. మహారాజవు. ధర్మాన్ని పాలించేవాడవు. రాక్షసులను నిర్మూలించే వాడవు. ఇది శ్రీమత్తెలుగుభాగవత తృతీయ స్కంధాంత ప్రార్థన.
3-1053-ta.
paramapaavana! viSvabhaavana! baaMdhavaprakaraananaa!
SaradhiSOshaNa! satyabhaashaNa! satkRpaamayabhooshaNaa!
duritataaraNa! sRshTikaaraNa! dushTalOkavidaaraNaa!
dharaNipaalana! dharmaSeelana! daityamardanakhaelanaa!
          పరమ = అత్యుత్తమ మైన; పావన = పవిత్రత కలవాడా; విశ్వ = విశ్వము అంతటను; భావన = తలచుకొనబడు వాడా; బాంధవ = బంధువుల; ప్రకర = సమూహములకు; ఆనన = రక్షించువాడా; శరధి = సముద్రమును; శోషణ = ఆవిరి చేసినవాడా; సత్య = సత్యము; భాషణ = మాట్లాడు వాడా; సత్ = మంచి; కృపా = దయతో; మయ = కూడుట అను; భూషణా = భూషణము కల వాడా; దురిత = పాపులను; తారణ = తరింప చేయు వాడా; సృష్టి = సృష్టికి; కారణా = కారణము అయిన వాడా; దుష్ట = దుష్టులగు; లోక = జనులను; విదారణ = సంహరించు వాడా; ధరణి = భూమిని; పాలన = పాలించు వాడా; ధర్మ = ధర్మబద్ధ మైన; శీలన = శీలము కల వాడా; దైత్య = రాక్షసులను; మర్దన = శిక్షంచుట అను; ఖేలనా = క్రీడ కల వాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: