Wednesday, March 12, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 225

అమ్మా మన్నిదినంగ

10.1-338-శా.
మ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
మ్మం జూడకు వీరి మాటలు మదిన్; న్నీవుగొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
మ్మాఘ్రాణము చేసి నా వచనముల్ ప్పైన దండింపవే.
          అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు – అని చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పేడు.
10.1-338-Saa.
ammaa! mannudinaMga nae SiSuvunO? yaa@MkoMTinO? veRRinO?
nammaM jooDaku veeri maaTalu madin; na nneevugoTTaMga vee
rimmaargaMbu ghaTiMchi cheppedaru; kaadaenin madeeyaasya gaM
dhammaaghraaNamu chaesi naa vachanamul tappaina daMDiMpavae.
          అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసి ఉన్నానా; వెఱ్ఱినో = వెర్రివాడినా; నమ్మంజూడకు = నమ్మబోకుము; వీరి = వీరి యొక్క; మాటలున్ = పలుకులను; మదిన్ = మనసు నందు; నన్నున్ = నన్ను; నీవున్ = నీవు; కొట్టంగన్ = కొట్టుట కోసము; వీరు = వీరు; = ఇలాంటి; మార్గమున్ = దారిని; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుచున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము = వాసనచూచుట; చేసి = చేసి; నా = నా యొక్క; వచనముల్ = మాటలు; తప్పు = అబద్దమైనవి; ఐనన్ = అయినచో; దండింపవే = శిక్షించుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

3 comments:

gajula sridevi said...

రావుగారు,మీ రచనా కృషి అద్భుతం.ఈ పద్యం జీవితంలో మరచిపోలేనంత గొప్పది.

vsrao5- said...

శ్రీదేవిగారు, మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు. ఈ మీ పలుకు భాగవతంపై మీకున్న ఇష్టం చూపుతోంది. చాలా సంతోషం.

vsrao5- said...
This comment has been removed by the author.