ghana siMhaMbula
10.1-1752-మ.
ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
మన కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
చనుచున్నా రదె; శౌర్య
మెన్నటికి? మీ శస్త్రాస్తముల్
గాల్పనే?
తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్
క్రంతలన్.
శ్రీకృష్ణుడు
రుక్మిణిని రథంమీద తీసుకు పోతుంటే, జరాసంధాదులు ఒకరి నొకరు హెచ్చరించు కొంటున్నారు
- అదిగో. గొప్ప సింహాల
కీర్తిని నీచ మైన జంతువులు హరిస్తు నట్లు, కావరంతో అయ్యాదవులు మన యశస్సు
కొల్లగొట్టి తను మధ్యను మన మధ్యనుంచే తరలించుకు పోతున్నారు. ఇలాం టప్పుడు కాకపోతే మన
ప్రతాపాలు ఎప్పటికి కొరగానివి ఐపోతాయి. అరె మన శస్త్రాస్త్రాలు తగలెయ్యడానికి కాదు
కదా. మన మా తరుణిని వారి బారి నుండి తప్పించి తెచ్చుకోలేకపోతే, సందు గొందుల్లో
సైతం ప్రజలు మనలను వెక్కిరిస్తారు.
10.1-1752-ma.
ghana
siMhaMbula keerti neechamRgamul^ gaikonna chaMdaMbunan^
mana keertul^
goni baala@M dODkonuchu nunmaadaMbutO gOpakul^
chanuchunnaa
rade; Saurya mennaTiki? mee Sastraastamul^ gaalpanae?
tanumadhyan^
viDipiMpamaeni nagarae dhaatreejanul^ kraMtalan^.
ఘన = గొప్ప; సింహంబుల = సింహముల యొక్క; కీర్తిన్ = కీర్తిని; నీచ = అల్ప మైన; మృగముల్ = జంతువులు; కైకొన్న = తీస్తున్న; చందంబునన్ = విధముగ; మన = మన యొక్క; కీర్తుల్ = కీర్తులను; కొని = తీస్తు; బాలన్ = కన్యను; తోడ్కొనుచున్ = కూడ తీసుకొని; ఉన్మాదంబు = ఒళ్ళు తెలియని తనము; తోన్ = తోటి; గోపకుల్ = గొల్లవారు; చనుచున్నారు = పోవుచున్నారు; అదె = అదిగో; శౌర్యము = పరాక్రమము; ఎన్నిటికిన్ = ఇక ఎప్పటికి; మీ = మీ యొక్క; శస్త్ర = శస్త్రములు; అస్త్రములు = అస్త్రములు; కాల్పనే = దేనికి తగుల బెట్టుటకా; తనుమధ్యన్ = యువతిని {తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుము కలామె), స్త్రీ}; విడిపింప మేని = విడిపించక పోయినచో; నగరే = నవ్వరా, ఎగతాళి చేయరా; ధాత్రీ = దేశం లోని; జనుల్ = ప్రజలు; క్రంతలన్ = సందు లమ్మట.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment