Sunday, September 15, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_56



2-50  విష్ణుకీర్తనములు

2-50-సీ.
విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు; కొండల బిలములు కువలయేశ!
చక్రిపద్యంబులఁ దువని జిహ్వలు; గప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు; కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
కమలాక్షు పూజకుఁ గాని హస్తంబులు; శవము హస్తంబులు త్యవచన!
ఆ. హరిపద తులసీ దళామోద రతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
గరుడగమను భజనతి లేని పదములు
పాదపముల పాదటల మనఘ!
                 భాగవతం అంటే భగవంతుడు, భగవద్భక్తి, భక్తుడు కదా. అట్టి భాగవత విశిష్టత పరమ భాగవతుడు, భాగవత ప్రయుక్త, బ్రహ్మర్షి, అవధూతోత్తముడు, వ్యాసపుత్రుడు పరీక్షిన్మహారాజుకి వివరిస్తున్నాడు – భూమండలేశ! కురువంశోత్తమ! యశోనాథ! సత్యం పలికేవాడ! రాజర్షి! పాపరహితుడా! విష్ణుమూర్తి నామ కీర్తనలు వినని చెవులు కొండ గుహలు. చక్రధారుడిమీద స్తోత్రాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు. లక్ష్మీపతి  మీద దృష్టిలేని కళ్ళు నెమలిపింఛాల మీది కళ్ళు. నారాయణుని చరణాలపై పూజింపబడే తులసీ దళాల సువాసన ఆఘ్రాణించని నాసిక పంది ముక్కు. పక్షివాహనుని స్తుతిస్తు అడుగులు వేయని  కాళ్ళు అచరము లైన చెట్ల వేళ్ళు.

2-50-see.
vishNukeertanamulu vinani karNaMbulu; koMDala bilamulu kuvalayaeSa!
chakripadyaMbula@M jaduvani jihvalu; gappala jihvalu kauravaeMdra!
SreemanOnaathu neekshiMpani kannulu; kaekipiMChaakshulu keertidayita!
kamalaakshu poojaku@M gaani hastaMbulu; Savamu hastaMbulu satyavachana!
aa. haripada tulasee daLaamOda rati laeni
mukku paMdimukku municharitra!
garuDagamanu bhajanagati laeni padamulu
paadapamula paadapaTala managha!
2-50-సీ.| విష్ణు = భగవంతుని; కీర్తనములు = స్తోత్రములు; వినని = వినని; కర్ణంబులు = చెవులు; కొండల = కొండ లందలి; బిలములు = గుహలు; కువలయ = భూమండలానికి; ఈశ = ప్రభువా; చక్రి = చక్రధారి యొక్క, విష్ణుని; పద్యంబులు = కీర్తించు పద్యములు; చదువని = చదువ కుండ ఉండే; జిహ్వలు = నాలుకలు; కప్పల = కప్పల యొక్క; జిహ్వలు = నాలుకలు; కౌరవ = కౌరవ వంశపు; ఇంద్ర = రాజా; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; మనో = మనస్సునకు; నాథునిన్ = ప్రభువును; ఈక్షింపని = చూడని; కన్నులు = కన్నులు; కేకి = నెమలి యొక్క {కేకి - కేకవేయునది - నెమలి}; పింఛ = పింఛము లందలి; అక్షులు = కన్నులు; కీర్తి = కీర్తికి; దయిత = భర్తా; కమలాక్షున్ = పద్మాక్షుని, విష్ణుని; పూజ = సేవించుట; కున్ = కు; కాని = కానట్టి; హస్తంబులున్ = చేతులు; శవము = శవము యొక్క; హస్తంబులున్ = చేతులు; సత్య = సత్యమునే; వచన = పలుకువాడా; హరి = విష్ణువు యొక్క; పద = పాదము లందలి; తులసీ = తులసీ; దళ = దళముల యొక్క; ఆమోద = వాసన లందు; రతి = ఆసక్తి; లేని = లే నట్టి; ముక్కు = ముక్కు; పంది = పంది యొక్క; ముక్కు = ముక్కు; ముని = మునుల వలె; చరిత = మెలగు వాడా; గరుడ = గరుడుని; గమను = వాహనముగ కలవాని; భజన = కీర్తించుటకు; గతి = వెళ్లుటకు; లేని = రానట్టి; పదములు = కాళ్ళు; పాదపముల = చెట్ల యొక్క; పాద = వేళ్ళ; పటలము = గుంపులు; అనఘ = పాపరహితుడా.  
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: