ఎంత కాలము
1-328-మత్త.
ఎంత కాలము గృష్ణుఁ డీశ్వరుఁ డి ద్ధరిత్రిఁ జరించు,
మీ
రంత కాలము నుండుఁ డందఱుఁ, నవ్వలం బనిలేదు, వి
భ్రాంతి మానుము; కాలముం
గడవంగ నెవ్వరు నోప, రీ
చింత యేల? నరేంద్రసత్తమ!
చెప్పెదన్ విను మంతయున్.
1-328-matta.
eMta
kaalamu gRshNu@M DeeSvaru@M Di ddharitri@M jariMchu mee
raMta
kaalamu nuMDu@M DaMda~ru@M navvalaM banilaedu, vi
bhraaMti
maanumu kaalamuM gaDavaMga nevvaru nOpa ree
chiMta
yaela? naraeMdrasattama! cheppedan^ vinumaMtayun^.
నారదుడు ధృతరాష్ట్రాదుల గురించి కలత
చెందిన ధర్మరాజుకి కాలసూచన చేస్తున్నాడు. – మహారాజా! కలవరపాటు వదలిపెట్టు.
శ్రీకృష్ణభగవానుడు ఎంత వరకు ఈ భూమ్మీద ఉంటాడో, అప్పటి దాకా మీ పాండవులు అందరు
కూడ ఉండండి. ఆయన అవతారం చాలించిన పిమ్మట మీరు ఉండక్కర్లేదు; ఎంతటి వారైనా
సరే కాల ప్రభావానికి తలవంచాల్సిందే. ధృతరాష్ట్రాదులకు ఏం జరిగిందో అంతా వివరంగా
చెప్తా. విను; ఇంకా దుఃఖించటం అనవసరం.
1-328-మత్త. |
ఎంత = ఎంత; కాలమున్ = కాలము; కృష్ణుఁడు = భగవంతుడు; ఈశ్వరుఁడు = భగవంతుడు; ఈ = ఈ; ధరిత్రిన్ = భూమి మీద; చరించున్ = విహరిస్తాడో; మీరు = మీరు కూడ; అంత కాలమున్ = అంత వరకు; ఉండుఁడు = ఉండండి; అందఱున్ = మీరు అందరును; అవ్వలన్ = ఆపైన; పని లేదు = అవసరము లేదు; విభ్రాంతి = మిక్కట మైన భ్రమను; మానుము = వదులుము; కాలమున్ = కాలమును; కడవంగన్ = దాటుటకు; ఎవ్వరున్ = ఎవరూ కూడా; ఓపరు = సమర్థులు కాలేరు; ఈ = ఈ; చింత = వగపు; ఏల = ఎందులకు; నరేంద్ర = రాజులలో; సత్తమ = ఉత్తముడా (ధర్మరాజ); చెప్పెదన్ = చెప్తాను; వినుము = వినుము; అంతయున్ = జరిగింది అంతా.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment