జగదవనవిహారీ
12-53-మా.
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదాసత్యభాషీ!
12-53-maa.
jagadavanavihaaree!
SatrulOkaprahaaree!
suguNavanavihaaree!
suMdareemaanahaaree!
vigatakalushapOshee!
veeravaryaabhilaashee!
svaguruhRdayatOshee!
sarvadaasatyabhaashee!
శ్రీరామా! లోకరక్షణకై
విహరించే వాడా! శత్రువులను ప్రహరించే వాడ! సుగుణాలవనంలో విహరించే వాడా! అందగత్తెల అభిమానాన్ని దోచుకొనే వాడా! కళంకరహితులను పోషించే వాడా! వీరవరులచేత అభిలషింపబడే వాడా! స్వీయగురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించిన వాడా! ఎల్లప్పుడు సత్యమే పలికేవాడా!
12-53-మా.| జగదవనవిహారీ = శ్రీరామా {జగదవనవిహారుడు - జగత్తును అవన (రక్షించుట)కై విహరించువాడు,
రాముడు}; శత్రులోకప్రహారీ = శ్రీరామా {శత్రులోకప్రహారుడు - శత్రువుల సమూహమును సంహరించువాడు, రాముడు}; సుగుణవనవిహారీ = శ్రీరామా {సుగుణవనవిహారుడు - సుగుణములు అనెడి వనమున విహరించువాడు, రాముడు}; సుందరీమానహారీ = శ్రీరామా {సుందరీమానహారుడు - అందగత్తెల అభిమానమును హరించువాడు, రాముడు}; విగతకలుషపోషీ = శ్రీరామా {విగతకలుషపోషుడు - విగతకలుష (కళంకరహితులను) పోషించువాడు, రాముడు}; వీరవర్యాభిలాషీ = శ్రీరామా {వీరవర్యాభిలాషుడు - వీరవర్యులచేత అభిలషింపదగినవాడు, రాముడు}; స్వగురుహృదయతోషీ = శ్రీరామా {స్వగురుహృదయతోషుడు - తన గురువునకు సంతోషము కలిగించువాడు, రాముడు}; సర్వదాసత్యభాషీ = శ్రీరామా {సర్వదాసత్యభాషి - ఎల్లప్పుడు సత్యమే పలుకు వాడు, రాముడు}.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment