Wednesday, September 18, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_59


kaluga@MDae naapaali

 8-87-సీ.
కలుగఁడే నాపాలి లిమి సందేహింపఁ; గలిమి లేములు లేకఁ లుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె లి నసాధువులచేఁ;బడిన సాధుల కడ్డడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ; జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల; మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
తే. అఖిల రూపముల్ దన రూప మైనవాఁడు
నాది మధ్యాంతములు లేక డరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
8-87-see.
kaluga@MDae naapaali kalimi saMdaehiMpa@M; galimi laemulu laeka@M galuguvaa@MDu?
naa kaDDapaDa raa@MDe nali nasaadhuvulachae@M; baDina saadhula kaDDapaDeDuvaa@MDu?
chooDa@MDae naa paaTu@M joopula@M jooDaka@M; joochuvaarala@M gRpa@M joochuvaa@MDu?
leelatO naa mo~raaliMpa@MDae mo~ra@Mgula; mo~ra le~ruMguchu@M dannu mo~raguvaa@MDu?
tae. akhila roopamul^ dana roopa mainavaa@MDu
aadi madhyaaMtamulu laeka yaDaruvaa@MDu
bhaktajanamula deenula paalivaa@MDu
vina@MDe? chooDa@MDe? tala@MpaDe? vaega raa@MDe?
          గజేంద్రుడు మొర పెట్టు కుంటున్నాడు. –  నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు.  దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?


8-87-సీ.| కలుగడే = సహాయముగా రా డేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయ పడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయ పడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కి నట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డ పడెడి = సహాయ పడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచు వారలన్ = తననే చూచు వారిని; కృపన్ = దయతో; చూచు వాడు = చూచెడి వాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తనను తానే; మొఱగు = మరచు; వాడు = వాడు; అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదిలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్తజనములన్ = భక్తులైన వారిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: