dhara virulu
4-489-క.
ధర విరులు గందకుండఁగ
సరసగతిం బూవుఁదేనెఁ జవిగొను నిందిం
దిరవిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.
4-489-ka.
dhara
virulu gaMdakuMDa@Mga
sarasagatiM
boovu@Mdaene@M javigonu niMdiM
diravibhu
kaivaDi budhu@MDagu
purushu@MDu
saaraaMSa maatma@Mbooni grahiMchun^.
క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి
చెప్తోంది – పువ్వులు కందకుండా
లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా
సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు.
4-489-క.| ధరన్ = ప్రపంచములో; విరులున్ = పూవులు; కందకుండగ = కందిపోకుండా; సరస = సున్నితమైన; గతిన్ = విధముగ; పూవుదేనెన్ = మకరందమును; చవిగొనున్ = తాగెడి; ఇందిందిరవిభున్ = గండుతుమ్మెద; కైవడిన్ = వలె; బుధుడు = ఙ్ఞాని; అగు = అయిన; పురుషుడు = మానవుడు; సారాంశమున్ = అవసరమైనదానిని; ఆత్మన్ = మనసున; పూని = పూనుకొని; గ్రహించున్ = సంపాదించుకొనును.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment