Sunday, September 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 70

anupama guNa haaraa

1-529-మా.
నుపమగుణహారా! న్యమా నారివీరా!
వినుతవిహారా! జానకీ చిత్త చోరా!
నుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
కలుష కఠోరా! కంది గర్వాపహారా!
            1-529-maa.
anupamaguNahaaraa! hanyamaa naariveeraa!
jana vinutavihaaraa! jaanakee chitta chOraa!
danuja ghana sameeraa! daanavaSree vidaaraa!
ghana kalusha kaThOraa! kaMdi garvaapahaaraa!  
          సాటిలేని కల్యాణ గుణ హారుడా! పరాజిత వైరులే గల వీరుడా! సర్వ లోకాలకు స్తుతింప తగ్గ విహారాలు గల మహాత్మా! సీతా మానస చోరుడా! శత్రువులనే మేఘాల పాలిటి సమీర మైన వాడా! రాక్షసుల వైభవాలు విదళించే వాడా! కరడు గట్టిన కలుషాత్ముల పాలిటి అతి కఠినుడా! సముద్రుని సమస్త గర్వాన్ని హరించిన వాడా! దయతో చిత్తగించుము.
          అనుపమ = సాటి లేని; గుణ = గుణములు అను; హారా = హారము కల వాడా; హన్యమాన = చంపబడిన; అరివీరా = శత్రువీరులు కల వాడా; జన = జనుల చేత; వినుత = స్తుతింప తగిన; విహారా = విహరాలు కల వాడా; జానకీ = జానకి యొక్క; చిత్త = మనస్సును; చోరా = దొంగిలించిన వాడా; దనుజ = రాక్షసులు అను; ఘన = మేఘములకు; సమీరా = వాయువు వంటి వాడా; దానవ = దానవుల; శ్రీ = ని; విదారా = విదళించు వాడా, బ్రద్దలు కొట్టు వాడా; ఘన = అత్యధిక, కరడు గట్టిన; కలుష = పాపుల ఎడ; కఠోరా = కఠోరముగా ఉండు వాడా; కంది = సముద్రుని; గర్వ = గర్వమును; అపహారా = తొలగించిన వాడా.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: