Wednesday, September 11, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_52




6-7 kaaLiki   

6-7-క.
కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ రకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.
6-7-ka.
kaaLiki bahusannuta lO
kaaLiki@M gamaneeya valaya karakeelita kaM
kaaLiki@M daapasa maanasa
kaeLiki vaMdanamu chaesi keertiMtu madin^.
          లోకాలన్నీ సాగిల పడి మొక్కే అమ్మ, కమనీయ కనకకంకాణాలు ధరించిన చేతులలో కపాలం ధరించే తల్లి, మహామునుల మనసులలో విహరించే మాత కాళీమాతను చేతులు జోడించి ప్రస్తుతిస్తాను.
                6-7-| కాళి = పార్వతీ దేవి; కిన్ = కి; బహు సన్నుత లోకాళి = పార్వతీ దేవి {బహు సన్నుత లోకాళి - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములు గలామె), పార్వతి}; కిన్ = కు; కమనీయ వలయ కర కీలిత కంకాళి = పార్వతీ దేవి {కమనీయ వలయ కర కీలిత కంకాళి - కమనీయ (మనోహర మైన) వలయ (కంకణములు) కర (చేతు లందు) కీలిత (అలంకరింపబడిన) కంక (పుర్రె గల) ఆళి (నిర్మల మైన మనసు గలామె), పార్వతి}; కిన్ = కి; తాపస మానస కేళి = పార్వతీ దేవి {తాపస మానస కేళి - తాపసుల మానస (మనసు లందు) కేళి (విహరించెడి యామె), పార్వతి}; వందనము = నమస్కారము; చేసి = చేసి; కీర్తింతున్ = స్తుతింతును; మదిన్ = మనసు నందు.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

1 comment:

Seenu said...

అమ్మలుగన్నయమ్మకు నా పాదాభివందనం