10.1-315 i mmaguva
10.1-315-క.
ఇ మ్మగువ తన్ను వాకిటఁ
గ్రుమ్మరుచోఁ జీరి నిలిపికొని పే రడుగం
గెమ్మావిఁ గఱచి వడిఁ జనె
నమ్మా! యీ ముద్దు కుఱ్ఱఁ డల్పుఁడె? చెపుమా.
10.1-315-ka.
i
mmaguva tannu vaakiTa@M
grummaruchO@M
jeeri nilipikoni pae raDugaM
gemmaavi@M
ga~rachi vaDi@M jane
nammaa!
yee muddu ku~r~ra@M Dalpu@MDe? chepumaa.
గొల్ల వెలదులు వెన్నదొంగ వేషాలు వివరాలు యశోదకు చెప్తున్నారు – నీ కొడుకు వాకిట్లో తిరుగు తుండగా చూసి ఈవిడ పిలిచి “నీ పేరేంటి
బాబు” అని అడిగింది.
మీ వాడు చటుక్కున ఆమె
ఎర్రని పెదవి కొరికి తుర్రుమని పారిపోయాడు. ఇప్పుడు చెప్ప వమ్మా! ముద్దుగారే ఈ
కుర్రాడు చిన్నాడా.
ఈ = ఈ; మగువ = ఇల్లాలు; తన్నున్ = అతనిని; వాకిటన్ = ఇంటి గుమ్మం ముందు; క్రుమ్మరుచోన్ = తిరుగు చుండగా; చీరి = పిలిచి; నిలిపికొని = నిల బెట్టి; పేరున్ = నామమును; అడుగన్ = ఏమి టని అడుగగా; కెంపు = ఎర్రని; మోవిన్ = పెదవిని; కఱచి = కరచి; వడిన్ = వేగముగా; చనెన్ = వెళ్ళిపోయెను; అమ్మా = తల్లీ; ఈ = ఈ; ముద్దు = మనోజ్ఞ మైన; కుఱ్ఱడు = పిల్ల వాడు; అల్పుడె = తక్కువ వాడా, కాదు; చెపుమా = తెలుపుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment