Thursday, September 26, 2013

తెలుగు భాగవత తేనె సోనలు - 67

chaMDa dOrdaMDaleela

4-505-తే.
చండ దోర్దండలీల భూమండలంబు
సమతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి
నొంది య వ్విభుఁ డీ లోకమందు నెల్ల
ప్రజకుఁ దండ్రియు జీవనప్రదుఁడు నగుచు.
4-505-tae.
chaMDa dOrdaMDaleela bhoomaMDalaMbu
samatalaMbuga@M jaesi SaSvatprasiddhi
noMdi ya vvibhu@M Dee lOkamaMdu nella
prajaku@M daMDriyu jeevanapradu@MDu naguchu.
          పృథుచక్రవర్తి తన భుజబలంతో నే లంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు.
           చండ = భయంకర మైన; దోర్దండ = భుజముల; లీలన్ = విలాసములతో; భూ మండలంబున్ = నేల అంతటిని; సమ తలంబున్ = ఎగుడు దిగుడు లేని ప్రదేశముగ; చేసి = చేసి; శశ్వత్ = శాశ్వత మైన; ప్రసిద్ధిన్ = కీర్తిని; ఒందెన్ = పొందెను; = ; విభుడు = ప్రభువు; = ; లోకము = జగము; అందున్ = లో యున్న; ఎల్ల = అందరు; ప్రజ = జనుల; కున్ = కు; తండ్రియు = తండ్రి; జీవన = జీవికను, జీవనోపాధిని; ప్రదుడున్ = సమకూర్చు వాడు; అగుచున్ = అవుతూ
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: