vaari@M gOruchunna
1-463-ఆ.
వారిఁ గోరుచున్న వారికి శీతల
వారి యిడుట యెట్టి వారి కయిన
వారితంబు గాని వలసిన ధర్మంబు
వారి యిడఁడు దాహవారి గాఁడు.
1-463-aa.
vaari@M
gOruchunna vaariki Seetala
vaari
yiDuTa yetti vaari kayina
vaaritaMbu gaani valasina dharmaMbu
vaari
yiDa@MDu daahavaari gaa@MDu.
దాహంతో
అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళ్ళడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది
గమనించక ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుం టున్నాడు – దాహంతో నోరెండి
పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం
ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు ఇవ్వటంలేదు,
దాహం తీర్చటం లేదు.
వారిన్ = నీరు; కోరుచు = అడుగుచు; ఉన్న = ఉన్న; వారు = వారు; కిన్ = కి; శీతల = చల్లని; వారి = నీరు; ఇడుట = ఇచ్చుట; ఎట్టి = ఎటువంటి; వారు = వారు; కిన్ = కి; అయినన్ = అయినను; వారితంబు = నివారింప బడుటకు - తప్పించుకొన; కాని = కాని - లేని; వలసిన = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; వారి = నీరు; ఇడఁడు = ఇవ్వడు; దాహ = దాహమును; వారి = వారించువాడు; కాఁడు = కాడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment