2-95 yaj~naaMgi
2-95-క.
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞముఁ గావించితిం ద దర్పణ బుద్ధిన్.
బ్రహ్మదేవుడు నారదునికి విశ్వ ప్రకారం
వివరించి చెప్తున్నాడు – యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా
న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను.
ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను. ఇది నారయ పూరించిన భాగంలోని దని అంటారు.
2-95-ka.
yaj~naaMgi
yaj~naphaladu@MDu
yaj~naeSu@MDu
yaj~nakarta yagu bhagavaMtun^
yaj~napurushu@Mgaa
maanasa
yaj~namu@M
gaaviMchitiM dadarpaNa buddhin^.
యజ్ఞాంగిన్ = యజ్ఞం శరీరంగా కల వాడు; యజ్ఞ = యజ్ఞమునకు; ఫలదుడున్ = ఫలములు ఇచ్చు వాడు; యజ్ఞేశుడు = యజ్ఞమునకు ప్రభువు; యజ్ఞ = యజ్ఞమునకు; కర్త = చేయు వాడు; అగు = అయిన; భగవంతున్ = విష్ణుమూర్తిని; యజ్ఞ = యజ్ఞ; పురుషుఁగా = స్వరూపునిగా; మానస = మనస్సులో చేయు; యజ్ఞమున్ = యజ్ఞమును; కావించితిన్ = చేసితిని; తత్ = అతనికే; అర్పణ = సమర్పిస్తున్న; బుద్ధిన్ = బుద్ధితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment