ennaDuM baru
8-596-మత్త.
ఎన్నడుం బరు వేఁడఁ బోఁడట;
యేకలుం డఁట; కన్న
వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్ని విద్యల మూల గో
ష్ఠి న్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపనిఁ ద్రోసిపుచ్చఁగ జిత్త మొల్లదు సత్తమా!"
వామనుడికి దానం ఇవ్వద్దు ప్రమాదం అంటు చెప్పిన తన గురువు శుక్రాచార్యుల వారి సలహాను ఎందుకు తిరస్కరిస్తున్నాడో బలి చక్రవర్తి వివరిస్తున్నాడు. – మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముండదు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు.
8-596-matta.
ennaDuM
baru vae@MDa@M bO@MDaTa; yaekaluM Da@MTa; kanna vaa
rannadammulu
naina laera@MTa; yanni vidyala moola gO
shThi
nne~riMgina prODa gujja@MTa; chaetu loggi vasiMpa nee
chinni
paapani@M drOsipuchcha@Mga jitta molladu sattamaa!
8-596-మత్త.| ఎన్నడుంబరువేఁడఁబోఁడట - ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; యేకలుండఁట - ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారన్నదమ్ములునైన - కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరఁట - లేరు = లేరు; అటన్ = అట; యన్నివిద్యల - అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠిన్నెఱింగిన - మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జఁట - ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులొగ్గి - చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపనీ - వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిఁద్రోసిపుచ్చఁగజిత్తమొల్లదు - చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
2 comments:
"ప్రోడ గుజ్జు", బలే మాట వాడేరు పోతనగారు ఆనందఃalfee
అవునండి ఆయన అంతే నండి. అంతేకాదు ఆనందః అనిపిస్తుంటాడు. మరి ఆధ్యాత్మిక ప్రౌఢత్వంలో ఆరితేరిన వాడు కదా. భక్తులకు కావలసిన గుజ్జు అలా అలా అందించేస్తూ ఉంటాడు మరి. ఏంచేస్తాం. రెండు నమస్కారాలు చేద్దామండి మనిద్దరం.సరేనాండి
Post a Comment