తనయులార
5.1-67-ఆ.
తనయులార! వినుఁడు ధరలోనఁ బుట్టిన
పురుషులకును శునకములకు లేని
కష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల
వలన బుద్ధి చేయవలదు మీరు.
5.1-67-aa.
tanayulaara! vinu@MDu dharalOna@M buTTina
purushulakunu Sunakamulaku laeni
kashTamulanu dechchu@M gaana@M gaamaMbula
valana buddhi chaeyavaladu meeru.
బిడ్డల్లారా! ఈ లోకంలో పుట్టిన మానవులు కామానికి లొంగి
పోతే కుక్కలకు కూడా రాని కష్టాలు ఎదురౌతాయి. అందుచేత కోరికలకు దూరంగా ఉండండి. – మొదలైన మంచి మాటలు ఋషభుడు అనే మహారాజు గృహస్థ జీవితం
విడనాడి కొడుకులకు రాజ్యం అప్పచెప్పేస్తూ చెప్పాడు.
5.1-67-| తనయులార - తనయులారా = కుమారులారా; వినుఁడు - వినుడు = వినండి; ధరలోనఁ బుట్టిన - ధర = భూమి; లోనన్ = అందు; పుట్టిన = పుట్టిన; పురుషులకును - పురుషుల్ = మానవుల; కునున్ = కు; శునకములకు లేని - శునకముల్ = కుక్కల; కున్ = కూడా; లేని = లేనట్టి; కష్టములను దెచ్చుఁ గానఁ గామంబుల - కష్టములన్ = కష్టాలను; తెచ్చున్ = తీసుకు వస్తాయి; కాన = కనుక; కామంబులన్ = కోరికల; వలన - వలనన్ = యందు; బుద్ధి = మనసు; చేయవలదు = పడ వద్దు; మీరు = మీరు.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment