tOyaMbu livi yani
10.1-377-సీ.
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు; తలఁచెదు
గట్టైనఁ దరల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె; దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
దన్యుల నల్పంబు లడుగంగఁ బాఱెదు; రాచవేఁటలఁ
జాల ఱవ్వఁ దెచ్చె;
దలయవు నీళ్ళకు నడ్డంబు గట్టెదు; ముసలివై
హలివృత్తి మొనయఁ; జూచె
ఆ. దంబరంబు
మొలకు నడుగవు తిరిగెద
వింకఁ గలికి చేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్చ నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.
కృష్ణుని అల్లరి చూసి యశోద ఇలా
నిందిస్తోంది – అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు (మత్యావతారుడవు
కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు (కూర్మావతారుడవు కదా). పరాయి వాళ్ళ
దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు (వామనాతారుడవు కదా). నీకు రాజసం ఎక్కువ
ఎన్నో జగడాలు తెస్తావు (పరశురామావతారుడవు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డు కట్టలు
వేయాలని చూస్తావు (రామావతారుడవు కదా). దుడ్డుకర్ర పట్టుకొని నాగలిదున్నే వాడిలా
నటిస్తావు (బలరామావాతారుడవు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు (బుద్ధావతారుడవు
కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో (ఇక ముందు కల్కి
అవతార మెత్తి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా
కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు (త్రివిక్రమావతారుడవు కదా).
10.1-377-see.
tOyaMbu livi
yani tolagaka chochchedu; tala@Mchedu gaTTaina@M darala
netta;
maMTitO
naaTalu maanavu; kOraaDe; dunnata staMbhaMbu loo@Mpa@M
bOye;
danyula
nalpaMbu laDugaMga@M baa~redu; raachavae@MTala@M jaala
~ravva@M dechche;
dalayavu
neeLLaku naDDaMbu gaTTedu; musalivai halivRtti monaya@M;
jooche
aa. daMbaraMbu
molaku naDugavu tirigeda
viMka@M
galiki chae@Mta laela putra!
ninnu vaMpa
vraalcha nae naera naniyo nee
viTTu
kriMdu mee@Mdu ne~ru@Mga kuniki.
తోయంబులు = నీళ్ళు; ఇవి = ఇవి; అని = అని; తొలగక = తప్పుకొనక; చొచ్చెదు = ప్రవేశించెదు (మత్యావతార సూచన); తలచెదు = ప్రయత్నించెదవు; గట్టైనన్ = కొండ నైన; తరల నెత్తన్ = లేవ నెత్తుటకు (కూర్మావతార సూచన); మంటితోన్ = మట్టితో; ఆటలు = ఆటలాడుట; మానవు = వదలవు; కోరాడెదు = గుచ్చి యెత్తదవు (వరాహావతార సూచన); ఉన్నత = ఎత్తైన; స్తంభంబులున్ = స్తంభములను; ఊప బోయెదు = ఊపుటకు పోయెదవు (నరసింహావతార సూచన); అన్యులన్ = పరులను; అల్పంబులు = చిన్నవి; అడుగన్ = అర్థించుటకు; పాఱెదు = వెళ్ళెదవు (వామనావతార సూచన); రాచ = పెద్ద (రాజులను); వేటలన్ = పేట లందు (వేటాడు టందు); చాలన్ = మిక్కిలి; ఱవ్వ = అపకీర్తి (గొడవలు); తెచ్చెదు = తీసుకొచ్చెదవు (పరశురామావతార సూచన); అలయవు = అలస టన్నది లేదు; నీళ్ళు = జలముల; కున్ = కు; అడ్డంబున్ = కట్టను; కట్టెదు = కట్టుదువు (రామావతార చూచన); ముసలివి = ముసలము పట్టుకొన్నవాడవు; ఐ = అయ్యి; హలి = రైతు వలె (నాగలి ధారి); వృత్తిన్ = పనిలో; మొనయ జూచెదు = ప్రవేశింప చూచెదవు (బలరామావతార సూచన); అంబరంబున్ = బట్టలు; మొలకున్ = మొలకి కట్టుకొనుటకు; అడుగవు = కోరవు (బౌద్ధావతార సూచన); తిరిగెదవు = నడచెదవు; ఇంకన్ = మళ్ళీ; కలికి = జగడపు; చేతలు = పనులు; ఏలన్ = ఎందుకు (కల్క్యవతార సూచన); పుత్ర = కొడుకా; నిన్నున్ = నిన్ను; వంపన్ = సరిచేయుటకు; వ్రాల్చన్ = అణచుటకు; నేన్ = నేను; నేరను = అసమర్థురాలను; అనియొ = అనా; నీవు = నీవు; ఇట్టు = ఇలా; కిందుమీదున్ = కిందమీద (ఆకాశం
నేల);
ఎఱుగకున్ = తెలియక వర్తించుట; కిన్ = కుకారణము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
2 comments:
Can I use the bhagavatam poems by cut and paste from your website for my use? Thanks
Sorry friend please do not cut any part from my site. though i am just 64 young i don`t think i can redo it. and there may be some people want it.
you are welcome to use them by copy and paste as long as it is not for commercial use.
or if needed can contact me for getting in file format.
ధన్యవాదాలు మీ స్పందనకు.
Post a Comment