బాలాజన
1-309-క.
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాలసు లగు మానవులను
గాలము వంచించు దురవగాహము సుమతీ!
శౌనక
మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే
ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాలు యందు మునిగి తేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం
చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసి కొనుట దుస్సాధ్యం సుమా.
1-309-ka.
baalaajana
Saalaa dhana
leelaavana
mukhya vibhava leena maneeshaa
laalasu
lagu maanavulanu
gaalamu
vaMchiMchu duravagaahamu sumatee!
1-309-క.| బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవములందు; లీన = మునిగి / లీనమై; మనీషా = ప్రజ్ఞ; లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది / అంతు చిక్కనిది; సుమతీ = మంచి బుద్ది కల వాడా, శౌనకా.
~~~|సర్వేజనాః
సుఖినోభవంతు|~~~
3 comments:
Amruthathulyam
ధన్యవాదాలు మీ స్పందనకి. మరి పోతన అంటేనే అంతే కదండి. పంచదార అద్ది తేనెలో ముంచి మరీ గంటంతో రాస్తాడు.
Post a Comment