Thursday, January 22, 2015

రుక్మిణీకల్యాణం - భూమికి

99- క.
భూమికి ధన ధాన్యములకు
భాలకును మానములకుఁ బ్రాభవములకుం
గామించి మీఁదుఁ గానరు
శ్రీ దమున మానధనులు చెనఁకుదు రొరులన్.
          మానవంతులు ధనమదాంధులు అయ్యి, రాజ్యం కోసం ధనధాన్యాల కోసం, స్త్రీల కోసం, పరువు కోసం, అధికారాల కోసం అర్రులు చాచి కిందు మీదు కానరు. ఇతరులను హింసిస్తారు. అంటు బలరాముడు, రుక్మి దీనావస్థకి చింతిస్తున్న రుక్మిణిని సముదాయించసాగాడు
99- ka.
bhoomiki dhana dhaanyamulaku
bhaamalakunu maanamulakuM~ braabhavamulakuM
gaamiMchi meeM~duM~ gaanaru
shree madamuna maanadhanulu chenaM~kudu rorulan.
          భూమి = రాజ్యము; కిన్ = కోసము; ధన = సిరి; ధాన్యముల్ = సంపదల; కున్ = కోసము; భామల్ = స్త్రీల; కును = కోసము; మానముల్ = గౌరవముల; కున్ = కోసము; ప్రాభవముల = వైభవముల; కున్ = కోసము; కామించి = కోరి; మీదున్ = రాబోవు నరకాదులను; కానరు = విచారింపరు; శ్రీ = సంపద; మదమునన్ = గర్వముచేత; మానధనులు = మానమే ధనంగా గలవారు; చెనకుదురు = హింసించెదరు; ఒరులన్ = ఇతరులను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: