Friday, September 13, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_54



బాలాజన

1-309-క.
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాసు లగు మానవులను
గాము వంచించు దురవగాహము సుమతీ!
          శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాలు యందు మునిగి తేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసి కొనుట దుస్సాధ్యం సుమా.
1-309-ka.
baalaajana Saalaa dhana
leelaavana mukhya vibhava leena maneeshaa
laalasu lagu maanavulanu
gaalamu vaMchiMchu duravagaahamu sumatee!
          1-309-క.| బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవములందు; లీన = మునిగి / లీనమై; మనీషా = ప్రజ్ఞ; లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది / అంతు చిక్కనిది; సుమతీ = మంచి బుద్ది కల వాడా, శౌనకా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

3 comments:

Ravi said...

Amruthathulyam

vsrao5- said...
This comment has been removed by the author.
vsrao5- said...

ధన్యవాదాలు మీ స్పందనకి. మరి పోతన అంటేనే అంతే కదండి. పంచదార అద్ది తేనెలో ముంచి మరీ గంటంతో రాస్తాడు.