Sunday, September 1, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_42

రా పూర్ణచంద్రిక

10.1-604-సీ.
.“రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!; రమ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక!; రమ్ము చింతామణి! మ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ!; రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!; రమ్ము మందాకిని! రా శుభాంగి!
ఆ. యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూరమందు మేయ
ఘనగభీరభాషఁ డునొప్పఁ జీరు నా
భీరజనులు పొగడఁ బెంపు నెగడ.
10.1-604-see.
.“raa poorNachaMdrika! raa gautameegaMga!
            rammu bhageeratharaajatanaya!
raa sudhaajalaraaSi! raa maeghabaalika!
            rammu chiMtaamaNi! rammu surabhi!
raa manOhaariNi! raa sarvamaMgaLa!
            raa bhaarateedaevi! raa dharitri!
raa Sreemahaalakshmi! raa maMdamaaruti!
            rammu maMdaakini! raa SubhaaMgi!”
aa. yanuchu ma~riyu@M galugu naakhyalu gala gOvu
laDavilOna dooramaMdu maeya
ghanagabheerabhaasha@M gaDunoppa@M jeeru naa
bheerajanulu pogaDa@M beMpu negaDa.
          గోవులు (ఙ్ఞానులు నామ రూప ఙ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్చమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు అదిగో శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరిస్తున్నాడు – ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు.
                10.1-604-సీ. | రా = రమ్ము; పూర్ణచంద్రిక = పూర్ణచంద్రిక (గోవు పేరు); రా = రమ్ము; గౌతమీగంగ = గౌతమీగంగ; రమ్ము = రమ్ము; భగీరథరాజతనయ = భగీరథరాజతనయ; రా = రమ్ము; సుధాజలరాశి = సుధాజలరాశి; రా = రమ్ము; మేఘబాలిక - మేఘబాలిక = మేఘబాలిక; రమ్ము = రమ్ము; చింతామణి = చింతామణి; రమ్ము = రమ్ము; సురభి = సురభి; రా = రమ్ము; మనోహారిణి = మనోహారిణి; రా = రమ్ము; సర్వమంగళ = సర్వమంగళ; రా = రమ్ము; భారతీదేవి = భారతీదేవి; రా = రమ్ము; ధరిత్రి = ధరిత్రి; రా = రమ్ము; శ్రీమహాలక్ష్మి = శ్రీమహాలక్ష్మి; రా = రమ్ము; మందమారుతి = మందమారుతి; రమ్ము = రమ్ము; మందాకిని = మందాకిని; రా = రమ్ము; శుభాంగి = శుభాంగి.
          యనుచు - అనుచున్ = అని; మఱియుఁ గలుగు నాఖ్యలు గల - మఱియున = ఇంకను; కలుగు = ఉన్న; ఆఖ్యలు = పేర్లు; కల = కలగిన; గోవు లడవి లోన - గోవులు = పశువులు; అడవి = అడవి; లోనన్ = అందు; దూర మందు - దూరము = దూరము; అందున్ = అందు; మేయ - మేయన్ = గడ్డి తినుచుండగా; ఘన = గొప్ప; గభీర = గంభీరమైన; భాషఁ గడు నొప్పఁ జీరు నాభీరజనులు - భాషన్ = గొంతుతో; కడున్ = మిక్కిలి; ఒప్పన్ = చక్కగా; చీరున్ = పిలిచును; ఆభీర = యాదవ; జనులు = ప్రజలు; పొగడఁ బెంపు నెగడ - పొగడన్ = కీర్తించుచుండగా; పెంపున్ = గొప్పదనముతో; నెగడన్ = అతిశయించగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: