Wednesday, April 3, 2013

పంచోపనిషణ్మయ దివ్యదేహము





పంచోపనిషత్తులు – 1ఈశ 2కేన 3కఠ 4ప్రశ్న 5మండూక ఉపనిషత్తులను పంచోపనిషత్తులు అంటారు.
ఉపనిషత్తులు ఆత్మ విచారణ సాధనములు. ఉపనిషత్తులు వేదాంత సారాన్ని, పరావిద్యని, పరమాత్మ తత్వాన్ని వివరిస్తాయి. వానిలో ముఖ్యమైనవి పంచోపనిషత్తులు. 
ఈ పంచోపనిషత్తులలో ప్రతిపాదితమైన ఆ పరమాత్మ లక్షణ మయమై ప్రకాశించే దేహమే ఆ భగవంతుని పంచోపనిషణ్మయ దివ్యదేహము అని భావిస్తున్నాను.
ఈ పంచోపనిషత్తుల మూలాలు -
1.      ఈశోపనిషద్
శుక్లయజుర్వేదీయ మధ్యాన్దనీశాఖానుసారిణీ కాణ్డవశాఖా కే చతుర్థ దషక్ కె దశమ అద్యాయ్ కె ప్రథమ అనువాక్ కో ఈశోపనిషద్ కహతె హై. (శుక్లయజుర్వేదంలోని మధ్యాందనీశాఖ అనుసరించిన కాండవ శాఖ యొక్క చతుర్థ దషకం యొక్క దశమ అద్యాయంలోని ప్రథమ అనువాక్కుని ఈశోపనిషత్తు అంటారు)
2.      కేనోపనిషద్
సామవేద్ కీ తలవకారశాఖా కె నవమ అధ్యాయ్ కో కేనోపనిషద్ కహతె హై. (సామవేదం లోని తలవకారశాఖ యొక్క నవమ అధ్యాయాన్ని కేనోపనిషత్తు అంటారు.)
3.      కఠోపనిషద్
కృష్ణయజుర్వేద్ కీ కఠశాఖా కీ యహ్ కఠోపనిషద్ హై. (కృష్ణయజుర్వేదంలోని కఠశాఖయే కఠోపనిషత్తు.)
4.      ప్రశ్నోపనిషద్
అధర్వవేద్ కీ పిప్పలాదశాఖా కా ప్రశ్నోపనిషద్ హై. (అధర్వణ వేదంలోని పిప్పలాద శాఖయే ప్రశ్నోపనిషత్తు.)
5.      మండూకోపనిద్
అధర్వవేద్ కీ శౌనకీశాఖా కా యహ్ ముండకోపనిషద్ హై. (అధర్వణవేదం లోని శౌనకీ శాఖయే ముండకోపనిషత్తు.)
మూలాలు – శ్రీమహాలక్ష్మీనారాయణయఙ్ఞసమితి, ఓభాపట్టీ సమారియా, భోజపుర్ జిల్లా, ద్వారా ప్రచురింపబడిన ఈశాదిపంచోపనిషదః నుండి గ్రహించడ మైనది.

Wednesday, March 6, 2013

గాయత్రి - మంత్రార్థ - నిరూపణ



గాయత్రిని భాగవతాన్ని సరిపోల్చారు భాగవతా కథా ప్రారంభంలో. రెండూ మహా మంత్ర పూరితాలు మహా ప్రభావవంతాలు. మహా శక్తిమంతాలు. ఙ్ఞాన విఙ్ఞానాలు అపేక్షించేవారికి గాయత్రి తారక మంత్రం.
గాయత్రీ మంత్రం బీజాక్షర పరిపూర్ణం. గాయత్రీ మంత్రంలోని ప్రతీ అక్షరం అక్షర శుభాలను అనుగ్రహిస్తుంది. వేటి కవే ప్రభావవంత మైనవి. అన్నీ కలిపి ప్రయోగిస్తే మహా ప్రభావవంత మంత్రం. అట్టి గాయత్రిలోని 24 అక్షరాలలో ప్రతి ఒక్కదాని యొక్క తత్వ, ఫల, బీజ, సిద్ధ్యాది 14 రకాల లక్షణ స్వరూపాలని గుంటూరు పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి వారు దయతో అనుగ్రహించారు. వాటి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
లేదా 

Saturday, December 22, 2012

భాగవత మకరందాలు - పూతన కథ

            భాగవత మకరందాలు ప్రోజక్ట్ లో ఏండ్రాయిడ్ ఫోనులలో పనిచేసే  గూగుల్ ఆప్ పూతన కథ విడుదల చేసాము. దీనిని కూడ ఆదరించి ప్రోత్సాహించండి. ఈ ఆప్ కింది బటన్ మీద క్లిక్ చేసి కూడ చూడగలరు.

Monday, November 26, 2012

భాగవత మకరందాలు - కృష్ణుడుఅవతరించుట

            భాగవత మకరందాలు ప్రోజక్ట్ లో ఏండ్రోయిడ్ ఫోన్లు టేబ్లెట్ లలో పనిచేసే  గూగుల్ ఆప్ కృష్ణుడుఅవతరించుట విడుదల చేయబడింది. దీనిని కూడ ఆదరించి ప్రోత్సాహించండి. ఈ ఆప్ కింది బటన్ మీద క్లిక్ చేసి కూడ చూడగలరు.

Sunday, September 23, 2012

రుక్మిణీ కల్యాణం - ఎప్

రుక్మిణీ కల్యాణం 




సాహిత్యాభిమానులు - సహృదయులు ఈ గూగుల్ ఎప్ ని ఆదరించగలరు.
ఇదీ మన పోతన తెలుగు భాగవతము ఆధారంగా చేసినదే. దీనిలో  పోతన గారి పద్యాలు, చిన్న భావం, పద్య పఠనం అనువుగా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లోంచి ఇన్ స్టాల్  చేసుకొంటే చక్కగా చేతిలోని సెల్ లో / టేబ్లెట్ లో ఒదిగి ఉండి సిద్దంగా ఉంటుంది.
లింకు - రుక్మిణీ కల్యాణం

Monday, August 27, 2012

కథల్లో లెక్కలేంటి


పురాణా లంటే పురాతన భక్తి కథల సమాహారాలు. వాటికి చక్కగా ఎలా ఎంచి లెక్కలిచ్చారో చూడండి. పురాణాలు 18. వాటిని అష్టాదశ పురాణాలంటారు. వాటి అన్నింటి గ్రంథసంఖ్య, అంటే ఎన్నేసి శ్లోకాలున్నాయో లెక్క, చక్కగా భాగవతం 12 స్కంధంలో (కింద పట్టిక చూడండి) ఇచ్చారు. ఈ లెక్క ఇప్పటికి మంత్రంలా చదువుతారు. కథల్లో లెక్కలేంటి అనకండి. ఒక కథాసంపుటిలో అలాంటి లెక్క ఇచ్చారంటే, ఎంత విశదంగా విశ్లేషించి ఎంచి గణించేవారో. అవును గణితంలోనే కాదు సాహిత్యంలో వేదాంతంలో పూజల్లో అన్నింట్లో ఎంచి లెక్కించడం చేసేవారు. అంకెల్ని కాలాన్ని అన్నిటిని విశేషంగా విశ్లేషించి ఎంచి గణించేవారు. అలాంటి సమచారం అంతా కాలక్రమంలో నష్టపోయామా. అంతటి గణితాశక్తి మనకి తగ్గిపోయిందా. అప్పటి మహర్షుల మేధాశక్తికి గణితాసక్తి కూడ కారణమా.
అష్టాదశ పురాణముల - గ్రంథ సంఖ్య
1                    బ్రహ్మపురాణము                                10000
2                   పద్మపురాణము                                 55000
3                   విష్ణుపురాణము                                 23000
4                   శివపురాణము                                   24000
5                   శ్రీమద్భాగవతము                               18000
6                   భవిష్యోత్తరపురాణము                          14500
7                   నారదపురాణము                                25000
8                   మార్కండేయపురాణము                       9000
9                   అగ్నిపురాణము                                 15400
10                 బ్రహ్మకైవర్తపురాణము                          18000
11                  లింగపురాణము                                  11000
12                 వరాహపురాణము                               24000
13                 స్కాందపురాణము                               81100
14                 వామనపురాణము                              10000
15                 కూర్మపురాణము                                17000
16                 మత్స్యపురాణము                               14000
17                 బ్రహ్మాండపురాణము                            12000
18                 గరుడపురాణము                                19000
           మొత్తము                                       400000