పురాణా లంటే పురాతన భక్తి కథల
సమాహారాలు. వాటికి చక్కగా ఎలా ఎంచి లెక్కలిచ్చారో చూడండి. పురాణాలు 18.
వాటిని అష్టాదశ పురాణాలంటారు. వాటి అన్నింటి గ్రంథసంఖ్య, అంటే ఎన్నేసి
శ్లోకాలున్నాయో లెక్క, చక్కగా భాగవతం 12 స్కంధంలో (కింద పట్టిక చూడండి)
ఇచ్చారు. ఈ లెక్క ఇప్పటికి మంత్రంలా చదువుతారు. కథల్లో లెక్కలేంటి అనకండి.
ఒక కథాసంపుటిలో అలాంటి లెక్క ఇచ్చారంటే, ఎంత విశదంగా విశ్లేషించి ఎంచి గణించేవారో.
అవును గణితంలోనే కాదు సాహిత్యంలో వేదాంతంలో పూజల్లో అన్నింట్లో ఎంచి లెక్కించడం
చేసేవారు. అంకెల్ని కాలాన్ని అన్నిటిని విశేషంగా విశ్లేషించి ఎంచి గణించేవారు.
అలాంటి సమచారం అంతా కాలక్రమంలో నష్టపోయామా. అంతటి గణితాశక్తి మనకి తగ్గిపోయిందా.
అప్పటి మహర్షుల మేధాశక్తికి గణితాసక్తి కూడ కారణమా.
అష్టాదశ పురాణముల - గ్రంథ సంఖ్య
1
బ్రహ్మపురాణము 10000
2
పద్మపురాణము 55000
3
విష్ణుపురాణము 23000
4
శివపురాణము 24000
5
శ్రీమద్భాగవతము 18000
6
భవిష్యోత్తరపురాణము 14500
7
నారదపురాణము 25000
8
మార్కండేయపురాణము 9000
9
అగ్నిపురాణము 15400
10
బ్రహ్మకైవర్తపురాణము 18000
11
లింగపురాణము 11000
12
వరాహపురాణము 24000
13
స్కాందపురాణము 81100
14
వామనపురాణము 10000
15
కూర్మపురాణము 17000
16
మత్స్యపురాణము 14000
17
బ్రహ్మాండపురాణము 12000
18
గరుడపురాణము 19000
మొత్తము 400000
Courtecy: telugubhagavatam.com
2 comments:
chala thanks andi e vivarallu maku chepinanduku...
e website chala bagundi andi..
pothana bhagavatam ekkada dorukutundo hyd lo cheppa galaru
చాలా సంతోషం. మీ సహృదయానికి ధన్యవాదాలు. మీలాంటి వారి ప్రోత్సాహం మాకెంతో బలాన్ని ఇస్తుంది.
మీకు ఇలాంటి వివరాలు గణాంకాలు ఆసక్తి ఉంటే మన తెలుగుభాగవతం సైటులో 'వివరాలు" బొత్తం కింద వృత్తాంతాలు మున్నగునవి కూడ గమనించగలరు.
భాగవతం కావలన్నారు - అంటే పద్యగద్యలు గల పుస్తకం అని మీ ఉద్దేశ్యం అనుకుంటా. అలా అయితే.
మన తెలుగుభాగవతం సైటులో అలమార - పుస్తకాలు కింద వ్యాస భాగవతం వృత్తాంతం కింద 2 పిడిఎఫ్ పుస్తకాలకి లింకులు ఉన్నాయి. వాటి నుండి (2) పోతన తెలుగు భాగవతం, (1) వ్యాసభాగవతం తెలుగు లిపిలో దిగుమతి చేసుకొనవచ్చు. పేపరు పుస్తకాలు అంటే
టిటిడి వారిది టిటిడి వారి వద్ద లేదా తెలుగు సాహిత్య ఎకాడమీ వారిది తెలుగు విశ్వవిద్యాలయంలో దొరకవచ్చు.
Post a Comment