Monday, February 8, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అస్మదీయం బగు

7-257-సీ.
"స్మదీయం బగు నాదేశమునఁ గానిమిక్కిలి రవి మింట మెఱయ వెఱచు
న్ని కాలములందు నుకూలుఁడై కాని; విద్వేషి యై గాలి వీవ వెఱచు
త్ప్రతాపానల మందీకృతార్చి యైవిచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు
తిశాత యైన నా యాజ్ఞ నుల్లంఘించిమనుండు ప్రాణులఁ జంప వెఱచు;
7-257.1-తే.
నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచుమర కిన్నర గంధర్వ క్ష విహగ
నాగ విద్యాధరావళి నాకు వెఱచునేల వెఱువవు పలువ! నీ కేది దిక్కు.
టీకా:
          అస్మదీయంబు = నాది; అగు = అయిన; ఆదేశమునన్ = ఆజ్ఞచేత; కాని = తప్పించి; మిక్కిలి = అధికముగా; రవి = సూర్యుడు; మింటన్ = ఆకాశమున; మెఱయన్ = ప్రకాశించుటకు; వెఱచున్ = బెదురును; అన్ని = అన్ని; కాలములు = ఋతువుల; అందున్ = లోను; అనుకూలుండు = అనుకూలముగానుండువాడు; = అయ్యి; కాని = తప్పించి; విద్వేషి = అహితుడు; ఐ = అయ్యి; గాలి = వాయువు; వీవన్ = వీచుటకు; వెఱచున్ = బెదురును; మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమము యనెడి; అనల = అగ్నిచే; మందీకృత = మందగింపబడినవాడు; ఐ = అయ్యి; విచ్చలవిడిన్ = తన యిచ్చానుసారము; అగ్ని = అగ్ని; వెలుగన్ = మండుటకు; వెఱచున్ = బెదరును; అతి = మిక్కిలి; శాత = తీవ్రమైనది; ఐన = అయిన; నా = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘించి = అతిక్రమించి; శమనుండు = యముడు {శమనుండు - పాపములను శమింప చేయువాడు, యముడు}; ప్రాణులన్ = జీవులను; చంపన్ = సంహరించుటకు; వెఱచున్ = బెదరును; ఇంద్రుడు = ఇంద్రుడు; ఔదల = తలను. 
          నా = నా యొక్క; మ్రోలన్ = ఎదుట; ఎత్తన్ = ఎత్తుటకు; వెఱచున్ = బెదరును; అమర = దేవతల; కిన్నర = కిన్నరల; గంధర్వ = గంధర్వుల; యక్ష = యక్షుల; విహగ = పక్షుల; నాగ = సర్పముల; విద్యాధరా = విద్యాధరుల; ఆవళి = సమూహములు; వెఱచున్ = బెదరును; ఏల = ఎందుకు; వేఱవవు = బెదరవు; పలువ = దుర్జనుడా; నీ = నీ; కున్ = కు; ఏది = ఎక్కడ ఉన్నది; దిక్కు = రక్షించెడి ప్రాపు.
భావము:
            ఓ దుష్టుడా! నా ఆఙ్ఞ లేకుండా ఆకాశంలో ఆదిత్యుడు కూడా గట్టిగా ప్రకాశించడానికి బెదురుతాడు; వాయువు కూడా అన్ని కాలాలలోనూ అనుకూలంగానే వీస్తాడు తప్పించి అహితుడుగా వీచటానికి భయపడతాడు; అగ్నిహోత్రుడు కూడా దేదీప్యమానమైన నా ప్రతాపం ముందు మందంగా వెలుగుతాడు తప్పించి, ఇష్టానుసారం చెరలేగి మండటానికి భయపడతాడు; పాపులను శిక్షించే యముడు కూడా బహు తీక్షణమైన నా ఆఙ్ఞను కాదని ప్రాణుల ప్రాణాలు తీయటానికి వెరుస్తాడు; ఇంద్రుడికి కూడా నా ముందు తల యెత్తే ధైర్యం లేదు; దేవతలైనా, కిన్నరులైనా, యక్షులైనా, పక్షులైనా, నాగులైనా, గంధర్వులైనా, విద్యాధరులైనా, నేనంటే భయపడి పారిపోవలసిందే; అలాంటిది నువ్వు ఇంత కూడా లేవు. నేనంటే నీకు భయం ఎందుకు లేదు? ఇక్కడ నీకు దిక్కు ఎవరు? ఎవరి అండచూసుకుని ఇంత మిడిసిపడి పోతున్నావు?
७-२५७-सी.
"अस्मदीयं बगु नादशमुनँ गानि; मिक्किलि रवि मिंट मेर्रय वेर्रचु;
नन्नि कालमुलंदु ननुकूलुँडै कानि; विद्वेषि यै गालि वीव वेर्रचु;
मत्प्रतापानल मंदीकृतार्चि यै; विच्चलविडि नग्नि वेलुँग वेर्रचु;
नतिशात यैन ना याज्ञ नुल्लंघिंचि; शमनुंडु प्राणुलँ जंप वेर्रचु;
७-२५७.१-ते.
निंद्रुँ डौदल ना म्रोल नेत्त वेर्रचु; नमर किन्नर गंधर्व यक्ष विहग
नाग विद्याधरावळि नाकु वेर्रचु; नेल वेर्रुववु पलुव! नी केदि दिक्कु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: