Wednesday, February 10, 2016

ప్రహ్లాదుని జన్మంబు - కంఠక్షోభము

7-259-శా.
కంక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై
కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో
త్కంఠాబంధురుఁ డేని నే నమరులన్ ఖండింప దండింపఁగా
గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్.
టీకా:
          కంఠ = గొంతు; క్షోభము = నొప్పిపెట్టినది; కాగన్ = అయ్యేలా; ఒత్తిలి = గట్టిగా; మహా = మిక్కిలి; గాఢంబుగా = తీవ్రముగా; డింభ = కుర్రవాడా; వైకుంఠున్ = విష్ణుని; చెప్పెదు = చెప్పెదవు; దుర్జయుండు = జయింపరానివాడు; అనుచున్ = అనుచు; వైకుంఠుండు = విష్ణువు {వైకుంఠుడు - కుంఠము (ఓటమి) లేనివాడు, విష్ణువు}; వీరవ్రత = యుద్ధమునందలి; ఉత్కంఠా = వేడుక; ఆబంధురుడు = దట్టముగాగలవాడు; ఏని = అయినచో; నేన్ = నేను; అమరులన్ = దేవతలను {అమరులు - మరణములేనివారు, దేవతలు}; ఖండింపన్ = నరకుచుండగా; దండింపగాన్ = శిక్షించుటకు; కుంఠీభూతుడు = వెనకకి తగ్గువాడు; కాక = కాకుండగ; రా = రా; వలదె = వద్దా; మత్ = నా యొక్క; ఘోర = భయంకరమైన; ఆహవ = యుద్ధ; క్షోణికిన్ = రంగమునకు.
భావము:
            అర్భకా! వైకుంఠనాథుడైన విష్ణువుపై విజయం వీలుకాదు అంటూ గొంతు చించుకుని గట్టిగా తెగ అరుస్తున్నావు కానీ, అతనికే పౌరుషం వీరత్వం ఉంటే, నేను యుద్ధరంగంలో దేవతలను ఖండించేటప్పుడూ, దండించేటప్పుడూ భయపడకుండా వాళ్ళను రక్షించడానికి, నా ముందుకు రావాలి కదా?
७-२५९-शा.
कंठक्षोभमु गाँग नोत्तिलि महागाढंबुगा डिंभ! वै
कुंठुं जेप्पेदु दुर्जयुं डनुचु वैकुंठुंडु वीरव्रतो
त्कंठाबंधुरुँ डेनि ने नमरुलन् खंडिंप दंडिंपँगा
गुंठीभूतुँडु गाक रावलदे मद्घोराहवक्षोणिकिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: