7-260-శా.
ఆచార్యోక్తము
గాక బాలురకు మోక్షాసక్తిఁ బుట్టించి నీ
వాచాలత్వముఁ
జూపి విష్ణు నహితున్ వర్ణించి
మ ద్ధైత్య వం
శాచారంబులు
నీఱు చేసితివి మూఢాత్ముం
గులద్రోహి నిన్
నీచుం జంపుట
మేలు చంపి కులమున్ నిర్దోషముం
జేసెదన్.
టీకా:
ఆచార్య =
గురువుచేత; ఉక్తము = చెప్పబడినది; కాక = కాకుండగ; బాలుర = పిల్లల; కున్ = కు; మోక్ష
= ముక్తిపదమందు; ఆసక్తిన్ = ఆసక్తిని; పుట్టించి
= కలిగించి; నీ = నీ యొక్క; వాచాలత్వమున్
= వాగుడును; చూపి = చూపించి; విష్ణున్
= హరిని; అహితున్ = శత్రువును; వర్ణించి
= పొగడి; మత్ = నా; దైత్య = రాక్షస;
వంశ = కులపు; ఆచారంబులున్ = ఆచారములను;
నీఱు = బూడిద; చేసితివి = చేసితివి; మూఢాత్మున్ = మూర్ఖుడను; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయువాడను; నిన్ = నిన్ను; నీచున్ = నీచుడను; చంపుట = సంహరించుట; మేలు = మంచిది,
ఉత్తమము; చంపి = సంహరించి; కులమున్ = వంశమును; నిర్దోషమున్ = దోషములేనిదిగా;
చేసెదన్ = చేసెదను.
భావము:
ఆచార్యులు
చెప్పింది నువ్వు వినటంలేదు. పైగా నీ తోటి విద్యార్థులకు కైవల్యం మీద కాంక్ష
పుట్టిస్తున్నావు; నీ
వాచాలత్వం చూపించి మన విరోధి విష్ణువును విపరీతంగా పిచ్చిమాటలతో పొగడుతున్నావు; మన రాక్షస వంశ సంప్రదాయాలు అన్నీ
బూడిదపాలు చేశావు; నువ్వు
కులగ్రోహివి; మూఢుడివి; నీచుడివి; నీవంటి వాడిని చంపడమే మంచిపని.
నిన్ను చంపి నా వంశానికి మచ్చరాకుండా చేస్తాను.
७-२६०-शा.
आचार्योक्तमु गाक बालुरकु
मोक्षासक्तिँ बुट्टिंचि नी
वाचालत्वमुँ जूपि विष्णु
नहितुन् वर्णिंचि म द्धैत्य वं
शाचारंबुलु नीर्रु
चेसितिवि मूढात्मुं गुलद्रोहि निन्
नीचुं जंपुट मेलु चंपि
कुलमुन् निर्दोषमुं जेसेदन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment