7-265-క.
దిక్కులు
కాలముతో నే
దిక్కున
లేకుండుఁ గలుగుఁ దిక్కుల
మొదలై
దిక్కుగల
లేని వారికి
దిక్కయ్యెడు
వాఁడు నాకు దిక్కు
మహాత్మా!
టీకా:
దిక్కులు = దిక్కులన్నియు; కాలము = కాలము;
తోన్ = తోపాటు; ఏ = ఎట్టి; దిక్కునన్ = ఎక్కడాకూడ; లేకుండున్ = లేకుండపోవునో;
కలుగు = ఉన్నట్టి; దిక్కుల = గతులన్నిటికిని;
మొదలు = మూలము; ఐ = అయ్యి; దిక్కు = ప్రాపు, అండ; కల =
కలిగిన; లేని = లేనట్టి; వారి = వారి;
కిన్ = కి; దిక్కు = అండ; అయ్యెడు = అగునట్టి; వాడు = అతడు; నా = నా; కున్ = కు; దిక్కు
= రక్షకుడు; మహాత్మా = గొప్పవాడ.
భావము:
ఓ తండ్రీ! మహనీయుడా! ఈ దేశకాలాదుల ఎల్లలు
అవధులు సమస్తము ఆ స్వామి యందే లీనమై పోతుంటాయి. అతని యందే పుట్టుతూ ఉంటాయి. అతని
యందే వీటన్నిటికి ఆధారం కలుగుతూ ఉంటుంది. అండదండలు గలవారికి లేనివారికి అందరికి
అతని యందే రక్షణ లభించుతు ఉంటుంది. ఆ స్వామే నయ్యా నాకు రక్షకుడు.
అన్ని దిక్కులలోను తిరుగులేని నన్ను
కాదని నీకు దిక్కు అయ్యేవాడు ఎవడురా అని తర్జిస్తున్న తండ్రి హిరణ్యకశిపునకు, భక్తాగ్రేసరుడైన
ప్రహ్లాదుడు సమాధానం చెప్తూ సృష్టితత్వాన్ని సూచిస్తున్నాడు. ప్రాస, ప్రాసపూర్వస్థానం నాలుగు పాదాలకు, యతి దాని తరువాతి స్థానాలు
రెంటికి అక్షరసామ్యం వాడిన పద్యం నడక సందర్భోచితంగా ఉంది. నాలుగు దిక్కుల ఆధారం
స్థిరత్వం సూచిస్తోంది. దిక్కును ఆరు సార్లు వాడుట నల్దిద్దులు పైన కింద సూచిస్తు
అంతటా ధ్వనిపం జేస్తోంది. దిక్కుకి ఎల్ల లేదా అవధి, చోటు,
తూర్పాది దిక్కులు, ఆధారం, అండ రక్షణ అనే అర్థాలు ధ్వనింపజేసిన తీరు అద్భుతం. ఒక్క దిక్కుకి, ఆరు దిక్కులతో వినయంగా సమాధానం చెప్పటంలో ప్రహ్లాదుని వ్యక్తిత్వ విశిష్ఠత
వ్యక్తం అవుతోంది.
७-२६५-क.
दिक्कुलु कालमुतो ने
दिक्कुन लेकुंडुँ गलुगुँ दिक्कुल मोदलै
दिक्कुगल लेनि वारिकि
दिक्कय्येडु वाँडु नाकु दिक्कु महात्मा!
७-२६५-क.
दिक्कुलु कालमुतो ने
दिक्कुन लेकुंडुँ गलुगुँ दिक्कुल मोदलै
दिक्कुगल लेनि वारिकि
दिक्कय्येडु वाँडु नाकु दिक्कु महात्मा!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment