7-258-శా.
ప్రజ్ఞావంతులు
లోకపాలకులు శుంభద్ధ్వేషు లయ్యున్ మదీ
యాజ్ఞాభంగము
చేయ నోడుదురు రోషాపాంగదృష్టిన్
వివే
క జ్ఞానచ్యుత
మై జగత్త్రితయముం గంపించు
నీ విట్టిచో
నాజ్ఞోల్లంఘన
మెట్లు చేసితివి? సాహంకారతన్
దుర్మతీ!
టీకా:
ప్రజ్ఞావంతులు
= శక్తియుక్తులుగలిగిన; లోకపాలకులు = ఇంద్రుడు మొదలగువారు;
శుంభత్ = వృద్ధినొందుతున్న; ద్వేషులు =
పగగలవారు; అయ్యున్ = అయినప్పటికిని; మదీయ
= నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; భంగము =
దాటుట; చేయన్ = చేయుటకు; ఓడుదురు =
బెదరెదరు; రోష = రోషముతో; అపాంగ =
కడకంటి; దృష్టిన్ = చూపువలన; వివేక =
మంచి చెడ్డలనెరిగెడి; జ్ఞాన = తెలివి; చ్యుతము
= జారినది; ఐ = అయ్యి; జగత్త్రితయమున్
= ముల్లోకములు {ముల్లోకములు - భూలోకము
స్వర్గలోకము పాతాళలోకము}; కంపించున్ = వణకిపోవును; నీవు = నీవు; ఇట్టిచోన్ = ఇలాంటిపరిస్థితిలో;
ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనమున్ = దాటుట;
ఎట్లు = ఎలా; చేసితివి = చేసితివి; సాహంకారతన్ = పొగరుబోతుతనముతో; దుర్మతీ =
చెడ్డబుద్ధిగలవాడా.
భావము:
దుర్బుద్ధీ! మహా ప్రతాపవంతులు అయిన దిక్పాలకులు,
నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటున్నా కూడా, నా మాట జవదాటటానికి బెదురుతారు; నేను కోపంతో కడకంట చూసానంచే చాలు,
ముల్లోకాలూ వివేక, విఙ్ఞానాలు కోల్పోయి అల్లకల్లోలం అవుతాయి; అలాంటిది, అహంకారంతో నువ్వు నా ఆఙ్ఞను ఎలా ధిక్కరిస్తున్నావు?
७-२५८-शा.
प्रज्ञावंतुलु लोकपालकुलु
शुंभद्ध्वेषु लय्युन् मदी
याज्ञाभंगमु चेय नोडुदुरु
रोषापांगदृष्टिन् विवे
क ज्ञानच्युत मै
जगत्त्रितयमुं गंपिंचु नी विट्टिचो
नाज्ञोल्लंघन मेट्लु
चसितिवि? साहंकारतन् दुर्मती!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment