Sunday, February 14, 2016

ప్రహ్లాదుని జన్మంబు - బలయుతులకు

7-264-క.
"యుతులకు దుర్భలులకు
 మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
 మెవ్వఁడు ప్రాణులకును
 మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!
టీకా:
బలయుతుల్ = బలముగలవారల; కున్ = కు; దుర్బలుల్ = బలములేనివారల; కున్ = కు; బలము = అండ; ఎవ్వడు = ఎవరో; నీ = నీ; కున్ = కు; నా = నా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు; కున్ = కు; బలము = ప్రాపు, శరణు; ఎవ్వడు = ఎవరో; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; బలము = అండ; ఎవ్వండు = ఎవరో; అట్టి = అటువంటి; విభుడు = ప్రభువు; బలము = అండ; అసురేంద్రా = రాక్షసరాజా.
భావము:
            హిరణ్యకశిప రాక్షసరాజ! బలవంతులకు, బలహీనులకు, నీకు, నాకు, బ్రహ్మ మున్నగు వారికి, సృష్ణిలోని సర్వ ప్రాణులకు అందరికి శరణు అయిన వాడు ఎవరో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు. 
            అందానికి పెట్టిందిపేరు ఈ పద్యం. ప్రహ్లాదుడు సరిగా చదువుకోటంలేదని హిరణ్యకశిపుడు దండిస్తోంటే బెదరటం లేదు. నా దండన నుంచి నిన్ను కాపాడగలిగే దిక్కెవరు అన్న తండ్రికి కొడుకు వినయంగా సమాధానం చెప్తున్నాడు. పంచాబ్దముల వాని పంచదార పలుకులతో సహజత్వం ఉట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు ఎంతో చక్కగా నాటకీయత పండించారు మన సహజ కవి పోతనులవారు.
७-२६४-क. 
"बलयुतुलकु दुर्भलुलकु
बल मेव्वँडु? नीकु नाकु ब्रह्मादुलकुन्
बल मेव्वँडु प्राणुलकुनु
बल मेव्वं डट्टि विभुँडु बल मसुरेंद्रा!
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=8&Padyam=264.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: